బన్నీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన త్రివిక్రమ్

బన్నీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన త్రివిక్రమ్

అసలే గ్యాప్ బాగా వచ్చిందని బన్నీ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. నా పేరు సూర్య తర్వాత బన్నీ ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జనవరి 12న విడుదల కానుందని ఇప్పటికే పోస్టర్స్ కూడా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల మరో మూడు నెలలుండగానే ప్రమోషన్స్ కూడా వేగంగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో భాగంగానే పాటలు విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సామజవారగమన పాట అయితే సంచలనాలు రేపుతుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సేషనల్ సాంగ్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఇదే ఊపులో ఇప్పుడు రెండో పాటను విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సందర్భంగా అక్టోబర్ 21 సాయంత్రం 4 గంటలకు ‘రాములో రాములా… ‘ అనే పాటను విడుదల చేస్తామని చెప్పారు. దానికోసం ఆశగా వేచి చూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేసాడు దర్శకుడు త్రివిక్రమ్. పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటే.. మరో రోజు పాటు వాయిదా వేసారు.

చేతిలో మందు గ్లాసుతో బన్నీ ఊపు చూస్తుంటే పాట పిచ్చెక్కించడం ఖాయం అని నమ్ముతున్నారు అభిమానులు. పైగా సామజవరగమన స్టాండర్డ్స్ అలా సెట్ చేసింది. మొత్తానికి కారణమేదైనా కూడా పాట ఓ రోజు వాయిదా పడటంతో చిత్ర యూనిట్‌పై బన్నీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. టబు కీలక పాత్రలో నటిస్తుంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.