” బేబీ” ఈవెంట్ లో బన్నీ.. ఏమన్నారంటే..?

Allu Arjun
Allu Arjun

ఇటీవలే విడుదలైన ‘బేబి’ మూవీపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రాన్ని వైష్ణవి చైతన్య తెరకెక్కించిన విధానానికి ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నార. ఇదే క్రమంలో ఈ రోజు (గురువారం) నిర్వహించిన ‘బేబి అప్రిషియేట్ మీట్’కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బేబి’ సినిమాను ఆకాశానికెత్తిన బన్నీ.. ఒక్కడే హోమ్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యారో ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు.

‘బేబి’ చిత్రాన్ని మీడియా బాగా సపోర్ట్ చేసిందంటూ ముందుగా వారికి థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ తన స్పీచ్ కంటిన్యూ చేశారు. ‘బేబి టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్. సినిమాతో చింపేశారు. నిజానికి లవ్‌లో పెయిన్ చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘కాదల్ కొండేన్, అర్జున్ రెడ్డి’,7/G బృందావన్ కాలనీ, సినిమాలు ఇష్టం. కానీ అలాంటి సినిమాలు తీయడమే కష్టం. ఇలా రియల్ ఇన్సిడెంట్స్‌ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి కష్టపడి ఈ స్టోరీ రాసి, సినిమాగా మలిచిన సాయిరాజేష్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది’ అన్నారు బన్నీ.‘జనరల్‌గా ఇలాంటి జోనర్ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. చెప్తే నమ్మరు.. ఫస్ట్ హాఫ్ అయిపోగానే నేను ఊగిపోతున్నాను.

ఆల్రెడీ స్టేజిపై నిల్చుని ఈ స్పీచ్ మాట్లాడుతున్నట్లుగా ఊహించేసుకున్నా. ఒక్కటే చెప్తున్నా.. ఫస్టాఫ్ లేదు, సెకండాఫ్ లేదు. సినిమా సిక్సర్ అంతే. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని అంటారు. అది ఎంత నిజమో నాకు తెలియదు కానీ యంగ్ ఏజ్‌లో ప్రతి కామన్ మ్యాన్ గుండె కోత వెనక ఒక మహిళ తప్పకుండా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
‘నాకు ఈ సినిమాలో చాలా విషయాలు నచ్చాయి.

వాటి గురించి గంటసేపైనా చెప్పగలను. కథ రాసిన, తీసిన విధానంతో పాటు దర్శకుడు గారు, నటీనటుల నుంచి పెర్ఫామెన్స్ తీసుకున్న విధానం నచ్చింది. మొత్తంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి పనితనం.. తెర మీద కనపడింది. అందుకే ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. చిన్న సినిమాలు చూడట్లేదు. గాడిద గుడ్డు చూడట్లేదు. అదేం కాదు.. సినిమాలు బాగుంటే ఎందుకు చూడరు’ అంటూ ‘బేబి’ సినిమాను ఉదాహరణగా చూపించారు.

ఇక డైరెక్టర్ సాయి రాజేష్ గురించి చెప్తూ.. ‘నాకు గానీ,మారుతి గారికి గానీ. లేదా సుకుమార్ గారికి గానీ . ఈ సినిమా మీటర్ సర్. నాకైతే పిచ్చ వచ్చేసింది. మమూలుగా అమీర్‌పేటలో ఆటో కుర్రాళ్లు ఎలా ఉంటారో? ఆ ఫీలింగ్ నేనొక్కన్నే హోమ్ థియేటర్‌లో కూర్చుని సినిమా చూస్తున్నపుడు ఫీలయ్యా. ఇంటర్వెల్ టైమ్‌కు ఎగ్జైట్‌మెంట్ ఆపుకోలేక స్క్రీన్ దగ్గరికి వచ్చి ఊగిపోతున్నా.

అంత నచ్చింది నాకు సినిమా. సాయి రాజేష్ గారు ఎవరికో కథ చెప్పడానికి వెళ్తే.. ఇంతకుముందు స్పూఫ్ సినిమాలు చేశారని ఎగతాళి చేశారట. ఎప్పుడు, ఎవ్వడు, ఎక్కడ తిరుగుతారో ఎవ్వరికి తెలియదు. ఫైనల్‌గా ఒక్కటే చెప్తున్నా.. ఒక తల్లి బిడ్డను కనేందుకు ఎంత కష్టపడుతుందో అంత ఎఫర్ట్ పెట్టారు’ అని సాయి రాజేష్‌ను ఉద్దేశించి అన్నారు బన్నీ.