బుట్టా ఎవరికి తెలుసు… మరి విజయసాయి ?

Butta Renuka Joins in TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ముందు నుంచి ఊహించినట్టే ఆ లాంఛనం పూర్తి అయిపోయింది. కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. ఈ పరిణామాన్ని ఊహించే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ ఇంతకుముందే ప్రకటించింది. బుట్టా రేణుక టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంతో కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎంపీ లు ఇద్దరూ పార్టీ మారినట్టు అయ్యింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అసలు బుట్టా శక్తిసామర్ధ్యాలు ఏంటి అన్నదానిపై చర్చ మొదలైంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేణుక కి ఎంపీ లేదా ఎమ్మెల్యే ఏ టికెట్ కావాలన్నా ఇస్తామని టీడీపీ అంటోంది. అటు వైసీపీ మాత్రం ఆమె సత్తాని తేలిక చేస్తోంది. అసలు తాము టికెట్ ఇవ్వకముందు బుట్టా రేణుక గురించి ఎవరికి తెలుసు అని ప్రశ్నిస్తోంది.

వైసీపీ ప్రశ్నకి బుట్టా అనుచరుడు ఒకరు ఘాటు సమాధానం ఇచ్చారు. వైసీపీ సమాధానం చెప్పలేని ప్రశ్న వేశారు. వైసీపీ సీట్ ఏ సత్తా లేని వారికి ఇచ్చిందా అని రేణుక అనుచరుడు నిలదీశారు. వైసీపీ చెప్పింది నిజమే అనుకున్నా ఇప్పుడు జగన్ తరపున ఆ పార్టీ వ్యవహారాలు అన్ని చక్కబెడుతున్న విజయసాయి మాత్రం రాజకీయంగా ఇంతకుముందు ఎవరికి తెలుసు?. జగన్ అక్రమాస్తుల కేసులో మాస్టర్ మైండ్ గా జనానికి తెలిసిన ఆయన వైసీపీ వ్యవహారాలు నడపగా లేనిది బుట్టా ఎందుకు రాజకీయాల్లో రాణించరు అని ప్రశ్నించాడు. ఏదేమైనా బుట్టా అనుచరులు విజయసాయిని రింగ్ లోకి లాగి వైసీపీ నోరు మూయిస్తున్నారు.