అయ్యో పాపం నాగేశ్వర్… నాగ్ దెబ్బకి అలా?

news-analyst-k-nageshwar-says-goodbye-to-the-hans-india-news-paper

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కె. నాగేశ్వర్ … రాజకీయంగా ఆయనతో విభేదించేవాళ్ళు ఉంటారేమో గానీ ఆయన విద్వత్తుని ఎవరూ తక్కువగా చూడరు. సామాజిక ,రాజకీయ అంశాల్లో ఆయనకున్న పట్టు అపారం. అందుకే తెలుగు నేల మీద ఇంగ్లీష్ పేపర్ నిర్వహణలో ఈనాడు లాంటి సంస్థ సైతం తడబడినా కె.నాగేశ్వర్ మాత్రం ” ది హన్స్ ఇండియా ” పత్రికని ఎడిటర్ గా ఓ గాడిలో పెట్టగలిగారు. అయితే అది జర్నలిజం కోణం నుంచి మాత్రమే అని ఆ సంస్థ యాజమాన్యం భావించిందట. సర్క్యూలేషన్, యాడ్ రెవిన్యూ పెరగక పోతే పత్రిక బాగుంది అన్న పేరు ఎందుకు అనుకున్నారేమో గానీ. గానీ నాగేశ్వర్ కి పొగ పెట్టారట. సహజంగా నాగేశ్వర్ ని మాత్రమే కాదు ఎవరినైనా ఎంతో గౌరవించే “ది హన్స్ ఇండియా “యజమాని వామనరావు ఈ మధ్య జరిగిన సేల్స్ సర్క్యూలేషన్ రివ్యూ మీటింగ్ లో నాగేశ్వర్ ఇబ్బందిపడేలా మాట్లాడారట. ఇది ఏ మాత్రం ఊహించని నాగేశ్వర్ ఇక ఆ పత్రికకి గుడ్ బై కొట్టినట్టే అని మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. దీని వెనుక కారణం ఏమిటా అని ఆరా తీస్తే ఇంకో విషయం బయటపడింది.

టైమ్స్ అఫ్ ఇండియా నుంచి రిటైర్ అయిన కింగ్ షుక్ నాగ్ ని ఈమధ్య వామనరావు తన సలహాదారుగా నియమించుకున్నారట. ఆయన రెసిడెంట్ ఎడిటర్ గా వున్నప్పుడు టైమ్స్ లో తెలుగు రాజకీయాలు, సినీ వ్యవహారాలకు సంబంధించి వచ్చిన కొన్ని వార్తలు సంచలనం అయ్యాయి. ఆ ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని తాను ఎడిటర్ అయితే “ది హన్స్ ఇండియా ” కూడా ఎదిగిపోతుందని వామనరావు చెవిలో పోరడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. నాగేశ్వర్ పనితీరుతో పోల్చుకుని నాగ్ తో పనిచేయడానికి జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నా ఆయనకి లైన్ క్లియర్ చేయడానికే యాజమాన్యం రెడీ అయ్యిందట. ఆ విధంగా నాగేశ్వర్ ని నాగ్ అలా దెబ్బ కొట్టాడు పాపం.