సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్ఈ) పదో తరగతి తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను తన అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది.  ప్రభుత్వ సర్వీసులను అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్‌ మొబైల్‌ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఈ విద్యా సంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కరోనా మహమ్మారి తెరమీదకు రావడంతో కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశం ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది.

కరోనా మహమ్మారి మరింత తీవ్రమవుతున్న పరిస్థితుల్లో మిగిలిన పరీక్షలను రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షలకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన రీతిలో మార్కులను కేటాయించిట్టు సీబీఎస్‌ఈ తెలియజేసింది. ఆ రకంగా అన్ని పరీక్షలకు మదింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బుధవారం తుది ఫలితాలను విడుదల చేశారు. 12 వ తరగతి ఫలితాలు సీబీఎస్ఈ సోమవారమే విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. (సీబీఎస్‌ఈ ‘12’లో బాలికలదే పైచేయి). ఈ ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే ఇది 0.36 శాతం అధికం. ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 93.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 90.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మొత్తం ఫలితాల్లో 41,804 (2.23 శాతం) మంది విద్యార్థులు 95 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.