పెళ్లికొడుకును బ‌లితీసుకున్న సంబ‌రం

Celebratory Fire In wedding Claims Life of NRI Groom In Haryana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హ‌ర్యానాలో ఓ పెళ్లిసంబ‌రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లివేడుక‌ల్లో సంతోషంగా గాల్లోకి పేల్చిన తుపాకీ గురి త‌ప్పి వ‌రుణ్ని బ‌లితీసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… హ‌ర్యానాలోని కైథాల్ జిల్లా గుల్హా పట్ట‌ణానికి చెందిన 30 ఏళ్ల విక్ర‌మ్ స్విట్జ‌ర్లాండ్ లో స్థిర‌ప‌డ్డాడు. పెళ్లిచేసుకునేందుకు సొంత ప‌ట్ట‌ణం వ‌చ్చాడు. వ‌రుడు ఎన్నారై కావ‌డంతో వివాహ ఏర్పాట్లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు డ్యాన్సులు చేస్తూ స‌ర‌దా స‌ర‌దాగా గ‌డుపుతున్నారు.

ఈ సంద‌ర్భంగా బంధువుల్లో ఒక‌రు ఆనందంగా తుపాకిని గాల్లోకి ప‌లుమార్లు కాల్చాడు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి అత‌డికి త‌గ‌లడంతో తుపాకీ గురి త‌ప్పి అంతులేని విషాదం జ‌రిగింది. తూటా నేరుగా వెళ్లి పెళ్లికొడుకు గుండెను చీల్చేసింది. కుటుంబ స‌భ్యులు హుటాహుటిన విక్ర‌మ్ ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోయింది. అప్ప‌టికే విక్ర‌మ్ మృతిచెందాడ‌ని వైద్యులు చెప్పారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.