డేరా చించిన సాధారణ మహిళ

a common woman taurus dera sacha sauda Destroy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సాధ్వి, సేవక్ ఇవి డేరాల్లో చిరపరిచితమైన పేర్లు. కానీ సాధ్వులంతా బాబా దగ్గర వేశ్యలేనని, సేవక్ లు మాత్రం నపుంసకలని కోట్లాది మంది డేరా భక్తులకు తెలియదు. ఇప్పుడు నిజాలు తెలిసి డేరాలంతా అవాక్కవుతున్నారు. పైగా బాబా గుఫాలో ఉన్న పడక గది చూసినవారు నోరెళ్లబెడుతున్నారు. 50 ఏళ్ల రసికుడికి చాలా సరసం తెలుసని మాట్లాడుకుంటున్నారు.

పైగా పెంపుడు కూతురితో కూడా శృంగారం జరిపిన దుర్మార్గుడని తెలిసి జనం అసహ్యించుకుంటున్నారు. ఇప్పుడు కోర్టు శిక్ష విధించింది కాబట్టి, కోర్టు శిక్షించింది కాబట్టి బాబాను అందరూ క్రూరుడని నమ్ముతున్నారు. కానీ బాబా దేవుడిగా వెలిగిపోతున్న రోజుల్లోనే ధైర్యంగా న్యాయపోరాం చేసి, కోర్టుల చుట్టూ తిరిగిన ఓ సాధ్వి.. ఇప్పుడు బాబాను జైలు పాలు చేసింది. 2002 నుంచి ఆమెను సీబీఐ కూడా ప్రత్యేక భద్రతతో చూసుకుంటోంది.

తనకిష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకున్న సదరు సాధ్వి ఇద్దరు పిల్లల తల్లి కూడా. తన పిల్లల్ని చంపేస్తామని బెదిరించినా.. ఎక్కడా తొణక్కుండా డేరాని కటకటాల వెనక్కుపంపింది. ఆమెకు భర్త, అత్తమామలు సహకరించడంతో అనుకున్నది సాధించింది. ఇప్పుడు ఆమెను అందరూ దేవతలా చూస్తున్నారు. కానీ సెక్యూరిటీ కారణాలతో సీబీఐ మాత్రం ఆమె పేరు బయటపెట్టడం లేదు. జనం కూడా అలా సీక్రెట్ గా ఉంటేనే మంచిదని బలంగా నమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు:

ఉండవల్లికి మాట పడిపోయిందా ?

రోజాలో కొత్త భ‌యం

చైనాను వ‌ద‌ల‌ని అల‌వాటు