మంత్రులు హ్యాండిస్తారా..?

Telangana Congress False Comments On TRS Ministers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కలలు ఎక్కువయ్యాయి. ఏకంగా అధికార పార్టీ మంత్రులు ఎన్నికల ముందు తమ పార్టీలోకి వస్తారని నేతలు చెబుతున్న కబుర్లు చూసి ఏఐసీసీ కూడా ఫోన్లు చేసి క్లాస్ పీకుతోందట. మీరు పనులు చేయడం లేదు కానీ.. ప్రెస్ మీట్లో మాత్రం విజృంభిస్తున్నారని చురకలు అంటించిందట. మంత్రులు మన పార్టీలోకి ఎందుకొస్తారని ప్రశ్నించడంతో నేతలు నీళ్లు నిమిలారట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. కేసీఆర్ కోరినట్లుగా మోడీ సీట్లు పెంచలేదు కాబట్టి గులాబీలో ముసలం ఖాయమని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కానీ కాంగ్రెస్ కే సిట్టింగు సీట్లు వస్తాయో.. లేదో నమ్మకం లేదు. అలాంటిది ఆ పార్టీలోకి వెళ్తే మాత్రం మంత్రులు ఎలా గెలుస్తారనే వాదనా ఉంది.

అయినా కాంగ్రెస్ కు మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకోవడం అలవాటైపోయింది. ఉద్యమ సమయంలో ఇలాగే భ్రమపడి తెలంగాణ ఇప్పించి.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను సమాధి చేశారు. ఇప్పుడూ అలాగే తమ బలాన్ని అతిగా ఊహించుకుంటూ.. ఏకంగా మంత్రులే వస్తారని కలలు కంటున్నారు. కానీ ఓసారి దెబ్బతిన్న ఏఐసీసీ మాత్రం నేతల మాటలు నమ్మడం లేదు. సొంత సర్వేలో తెలంగాణ కాంగ్రెస్ పనితీరు దారుణంగా ఉందని తేలడంతో.. ఫుల్లుగా తలంటిందట.

మరిన్ని వార్తలు:

లెజెండ‌రీ మామ‌య్య‌, అంద‌మైన కొడుకు

తాప్సి తెలివైన నిర్ణయం.. రెండున్నర కోట్ల లాభం