రజినీకాంత్‌కు వర్మ సలహాలు.. పీకేను వదల్లేదు

rgv Reaction on rajinikanth political entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై ఒక ప్రకటన వచ్చింది. తాను రాజకీయాల్లోకి వచ్చాను అని, ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా రజినీకాంత్‌ ప్రకటించాడు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాల నుండి తమ పార్టీ తరపున అభ్యర్థులు ఉండబోతున్నట్లుగా రజినీకాంత్‌ ప్రకటించిన నేపథ్యంలో పలువురు రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీపై పలు రకాలుగా కామెంట్స్‌ చేశారు. అందరిలోకి తాను విభిన్నం అనిపించుకునే వర్మ కూడా తనదైన శైలిలో రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీపై స్పందించాడు. ఈ స్పందనలో కూడా పవన్‌ గురించి వర్మ కామెంట్స్‌ చేశాడు.

వర్మ ఫేస్‌బుక్‌లో రజినీకాంత్‌ రాజకీయాల గురించి మాట్లాడుతూ… రజినీ రాజకీయాల్లోకి రావడం అనేది ఈ శతాబ్దపు అద్బుతం. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నగా ప్రకటించిన తర్వాత ఆయన సినిమాల్లో కంటే వెయ్యి రెట్లు అత్యధిక ప్రకాశవంతంగా, ప్రభావితం చేసే శక్తిగా కనిపించారు. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తాను అంటూ తలైవా చెప్పడం గ్రేట్‌ అన్నాడు.

ఇక రజినీకాంత్‌లాగా అన్ని అసెంబ్లీ స్థానాల నుండి పవన్‌ కూడా పోటీ చేయాలని, రజినీ మార్గంలో నడవాలి అంటూ పీకేకు వర్మ ఒక ఉచిత సలహా పడేశాడు. తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఇష్యూపై తనదైన శైలిలో వర్మ స్పందిస్తూ ఉంటాడు. రజినీకాంత్‌ రాజకీయాల గురించి వర్మ పాజిటివ్‌గా స్పందించిన నేపథ్యంలో అంతా కూడా ఆశ్చర్యంకు లోనవుతున్నారు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వెళ్లడంపై తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు కూడా అభినందను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.