చలసాని గారూ ఇదేనా మీ మేధావితనం ?

Chalasani Srinivas comments on Chandrababu Dharma Porata Deeksha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మనం చేస్తే సంసారం ఎదుటి వాడు చేస్తే ఇంకేదో అన్నారట వెనకటికి చలసాని శ్రీనివాస్ వంటి వ్యక్తి ఒకాయన. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ ప్రస్తావన ఎందుకు తేవలసి వచ్చింది అంటే ? ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వము అని బీజేపీ ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో తెలుగుదేశం బయటకి వచ్చేసి బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం మొదలు పెట్టింది. తమ ఎంపీలతో పార్లమెంట్ లో నిరసనలు చేయిస్తూ నేతలతో ఆంధ్రాలో నిరసనలు చేయిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్ష్యుడు చలసాని శ్రీనివాస్ కన్వీనర్గా ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఏర్పాటయింది. అయితే పార్టీలతో సంబంధం లేకుండా వారు కూడా నిరసనలు చేయిస్తూ వచ్చారు.

కొద్ది రోజులు అలాగే చేసిన సమితి ఇలా నిరసనలు చేస్తే ఉపయోగం లేదనుకుందో ఏమో ఈ నెల 16 న ఏపీ బంద్ కి పిలుపునిచ్చింది. ప్రభుత్వం మీద పోరుకి ఎల్లప్పుడూ సిద్దంగా ఉండే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేనలు ఈ బంద్ కి మద్దతు పలికాయి. అయితే ప్రజా పాలన, ఎమెర్జెన్సి విధుల కారణంగా అసలు బంద్‌లు, రాస్తారోకోలు చేస్తే రాష్ట్రానికే నష్టం అని అవి మన రాష్ట్ర ప్రజలకే ఇబ్బంది తప్ప కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు అని, దాని వలన మోడీ సంతోషిస్తాడే తప్ప రాష్ట్రానికి ఏమీ ఒరగదని చంద్రబాబు చెప్పారు, అలాగే ఏపీకి అన్యాయం చేసింది, చేస్తోంది ప్రధాని మోడీ ఏ నని ఆయనపై పోరాటం చేయాలని, ఢిల్లీ వెళ్లి మోడీపై పోరాటం చేయాలి కానీ… రాష్ట్రంలో రాస్తారోకోలు చేస్తే ఏం వస్తుందని చంద్రబాబు అన్నారు.

బంద్‌లు రాస్తారోకోల వల్ల రాష్ట్రానికే నష్టం అని, మన పోరాటాలు ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసమే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నా సమితి అధ్యక్షుడిగా ఉన్న చలసాని మాత్రం తాము చేయాలనుకున్న ఏపీ బంద్‌కు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌ బాధాకరమైన తప్పని సరిస్థితుల్లోనే పిలుపు ఇచ్చామని పేర్కొని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వివిధ పార్టీలకు చెందిన శ్రేణులు, నేతలు బస్సులను అడ్డుకోవడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయి ఆరోజు సరయిన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. అందులో ఇబ్బంది పడింది రాష్ట్ర ప్రజానీకమే. ఆరోజు అలా మాట్లాడిన చలసాని ఈరోజు మాత్రం ప్రత్యేక హోదా కోసం సీఎం ఢిల్లీలోనే దీక్ష చేయాలని అప్పుడే కేంద్రం దిగివస్తుందని ఆయన పేర్కొన్నారు. అంటే మనం చేస్తే సంసారం ఎదుటి వాఋ చేస్తే ఇంకేదో అన్నట్టు ఉంది చలసాని తీరు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.