‘ఛలో’ ప్రివ్యూ…

Chalo Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    నాగ శౌర్య, రష్మిక మందన 
నిర్మాత:     ఉష ముల్పూరి 
దర్శకత్వం :   వెంకీ కుదుముల 
సినిమాటోగ్రఫీ:   సాయి శ్రీరామ్ 
ఎడిటర్ :   కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ :   మహానటి స్వర సాగర్ 

నాగ్‌ అశ్విన్‌ హీరోగా పరిచయం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది, అయితే ఇప్పటి వరకు కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌లను మాత్రం ఈయన దక్కించుకోలేక పోయాడు. కొన్ని సినిమాలతో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు, కాని కలెక్షన్స్‌ విషయంలో మాత్రం ఏ ఒక్క సినిమా కూడా మంచి ఫలితాన్ని సాధించలేదు. అందుకే ఈసారి కాస్త ఎక్కువ బడ్జెట్‌తో ప్రయోగాత్మకంగా చిత్రాన్ని చేసేందుకు నాగశౌర్య సిద్దం అయ్యాడు. నాగశౌర్య తల్లి నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన చిత్రం ‘ఛలో’. వెంకీ కుడుము దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. 

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏకంగా మూడు కోట్లు పెట్టి ప్రమోట్‌ చేయడం జరిగింది. భారీగా ఖర్చు చేసి ప్రమోట్‌ చేయడం వల్ల సినిమాకు మంచి క్రేజ్‌ దక్కింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాట చూసి చూడంగానే నచ్చేసేవే.. పాటతో సినిమాపై అందరికి ఆసక్తి కలిగింది. మ్యూజికల్‌గా సినిమా సక్సెస్‌ అని ముందే నిరూపించుకుంది. ఇక రేపు విడుదల కాబోతున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ ప్రాంతాల మద్య జరిగే వినోదాత్మక కథతో నడుస్తుంది. నాగశౌర్య మరియు వెంకీ కుడుములకు ఈ చిత్రం సక్సెస్‌ చాలా అవసరం. ఇప్పటికే మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో తప్పకుండా సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా సినిమా భారీ స్థాయిలో వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో  ‘ఛలో’ ఫలితంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.