సాయిపల్లవి మీద ఇంకో రూమర్… నిజమెంత?

Rumors on Sai Pallavi Behavior

తెలుగు సినీ రంగంలో హీరోయిన్ సాయి పల్లవి కి హిట్స్ అయితే వస్తున్నాయి కానీ అంతకు మించి వివాదాలు కూడా పుడుతున్నాయి. అంతకుముందు ఆమె హీరోయిన్ గా నటించిన హీరోలు నాగ శౌర్య, నాని లతో విభేదాలు వచ్చాయని రూమర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో హీరో శర్వాతో కూడా అదే పరిస్థితి ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఒకే హీరోయిన్ మీద పదేపదే ఒకే తరహా పుకార్లు ఎందుకు వస్తున్నాయో అని అందరిలో ఓ డౌట్. ఈ విషయాన్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా తనకు ఎవరితో గొడవలు లేవని ఆమె చెప్పారు.ఆ విషయం లో ఎవరైనా అలాగే చెబుతారులే, ఏమీ లేకుండా ఇన్ని పుకార్లు వస్తాయా అనుకోవచ్చు. కానీ అసలు నిజం ఇంకోటి ఉందట.

సాయిపల్లవి సినిమా సెట్ లో హీరోని మాత్రమే కాదు… లైట్ బాయ్ ని కూడా గౌరవంగా చూస్తుందట. ఈ విషయం ఆమె తరపున ఏ మేనేజర్ చెప్పింది కాదు. ఆమెతో పని చేసిన నిర్మాతలు చెప్తున్న మాట. మరి ఈ పుకార్లు ఎందుకు పుడుతున్నాయి అంటే… ఆమె యూనిట్ లో చిన్నవారితో ఎలా ఉంటుందో, పెద్దోళ్ళతో కూడా అలాగే ఉంటుంది. ఈ తరహా ప్రవర్తన చిన్న వాళ్లకు సంతోషం కలిగిస్తే, కాస్త పెద్ద తలకాయలకు మాత్రం అదనపు గౌరవం దక్కడం లేదని అనుకుంటున్నారట. అయితే అందరు పెద్దవాళ్ళు ఇలా లేరట. ఇటీవల ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జ్వరం వచ్చి సాయి పల్లవి కాస్త ఆలస్యంగా వస్తే , జ్వరం వచ్చినా షూటింగ్ కి వచ్చిందని ఎవరూ మెచ్చుకోలేదు సరికదా ఇంకో హీరో తో ఇబ్బందులు వచ్చాయని రాశారు. ఇదండీ… నిప్పు లేకుండా పొగరావడం అంటే.