పడుకుంటేనే దేవరకొండ సినిమాలో అవకాశం…తమిళ నటి సంచలనం

chance in devarakonda movie

శ్రీ రెడ్డి ఉదంతం తర్వాత ఇండస్ట్రీలో ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ గురించి పెద్దగా ఏవీ వార్తలు రావడం లేదు. కానీ చాలా రోజుల తర్వాత ఒక తమిళ నటి విజయ్ దేవరకొండ సినిమా మీద సంచలన ఆరోపణలు చేసింది. త్వరలోనే విజయ్ దేవరకొండతో సినిమా తెరకెక్కించబోయే ఒక ప్రముఖ దర్శకుడు తనకి విజయ్ సినిమాలో అవకాశం ఇవ్వాలంటే తనతో పడక సుఖం పంచుకోవాలని అడిగాడని దాంతో తాను సినిమా వదిలేసుకున్నానని చెప్పి కలకలం రేపింది తమిళ నటి శాలు శాము. అయితే ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం ఈ ముద్దుగుమ్మ నిరాకరించింది. తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేస్తూ ఈ విషయాన్ని బయట పెట్టింది శాలు. మీకు ఎప్పుడైనా మీ టూ బాధలు ఎదుర్కొన్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఒక ప్రముఖ దర్శకుడు తనను పడక గదికి రావాలంటూ కోరాడని సంచలన ఆరోపణలు చేసింది ఈ తమిళ నటి. ఈ మధ్యే విడుదలైన శివకార్తికేయన్ మిస్టర్ లోకల్ సినిమాలో నటించింది శాలు. తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ విజయ్ దేవరకొండ సినిమాపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఇన్ని ఆరోపణలు చేసిన ఈ భామ ఆ దర్శకుడు పేరు చెప్పడానికి మాత్రం నో అంటుంది. న ఒకవేళ ధైర్యం చేసి ఫిర్యాదు చేసినా కూడా తప్పు చేసినట్లు ఆ దర్శకుడు ఒప్పుకోడు.. అంత దానికి తను పేరు చెప్పడం ఎందుకు అంటోంది ఈ ముద్దుగుమ్మ. విజయ్ తమిళ్ లో ఇంతకు ముందు నోటా సినిమా చేశాడు, ఇక ఆ తర్వాత మళ్ళీ ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో నటిస్తున్నాడు. మరి ఆ తమిళ నటిని పడక గదికి రమ్మని ఆహ్వానించింది వీరిద్దరిలో ఎవరో ?