Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Chandra Babu Naidu wants Poverty Alteration in Andhra Pradesh
పదమూడేళ్లు సీఎంగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాక కూడా.. చంద్రబాబుకు తీరని కోరిక ఉందట. అదే ఏపీలో పేదరికాన్ని పారద్రోలడం. ఉమ్మడి రాష్ట్రంలో ఈ లక్ష్యం కోసమే సంపదను సృష్టించామని, కానీ దాన్ని పంపిణీ చేసేలోపే అధికారం కోల్పోయామని బాబు చెప్పుకొచ్చారు.
అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. ఈ జిల్లా అంటే ఎన్టీఆర్ కు ఇష్టమని చెప్పారు. కష్ట కాలంలో కూడా చేతికి ఎముక లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలంతా ఆర్థికంగా పైకి ఎదగాలనేదే తన కోరికంటున్నారు చంద్రబాబు.
అందరూ నీతి, నిజాయితీతో కష్టపడి పనిచేస్తే.. విజయం దానంతట అదే వస్తుందన్నారు చంద్రబాబు. కష్టాన్ని కూడా అవకాశంగా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. ఓవైపు తాను కష్టపడుతూ.. మరోవైపు కష్టపడితేనే ఫలితం దక్కుతుందని జనానికి చెప్పడం ద్వారా.. మిగతా సీఎంల కంటే తాను భిన్నమని మరోసారి నిరూపించారు బాబు.
మరిన్ని వార్తలు: