ఎన్టీఆర్ బయోపిక్ లో బాబు,దగ్గుబాటి గొడవ?

chandrababu and daggubati venkateswara rao fighting episode in NTR Biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ పాత్ర ఎవరు పోషిస్తారు అన్నదానిమీద ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ పేరు వినిపిస్తుంటే ఇక చంద్రబాబు పాత్ర కి ఎవరిని తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. ఈ పాత్రకి జగపతిబాబు పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రొపోజల్ తో దర్శకుడు తేజ ఇప్పటికే జగపతిబాబుని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఈ రోల్ చేయడానికి ఓకే అన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో దగ్గుబాటి పాత్రధారి ఎవరో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన జీవితానికి సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ మాత్రమే చూపించడానికి బాలయ్య, తేజ ముందుగానే నిర్ణయం చేశారు. అయితే ఎన్టీఆర్ అల్లుళ్లుగా దగ్గుబాటి, చంద్రబాబు మధ్య ఆదినుంచి చిన్నవో పెద్దవో విభేదాలు కనిపిస్తూనే వున్నాయి. అయితే ఈ సినిమాలో అల్లుళ్ళ మధ్య గొడవల ఎపిసోడ్ జోలికి వెళ్లే అవకాశం లేదు. అలాంటి ఎపిసోడ్స్ జోలికి వెళితే లేనిపోని రచ్చ జరిగే అవకాశం ఉండటంతో సాధ్యమైనంతవరకు ఎన్టీఆర్ జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా మలవడం మీదే మేకర్స్ దృష్టి పెడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి దగ్గుబాటి, బాలకృష్ణ పాత్రలు ఎవరు చేస్తారో ఇంకా తెలియలేదు. ఆ పాత్రధారులు ఎవరో తేలిపోయాక సినిమా షెడ్యూల్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.