సన్నీలియోన్ ఆమెకి అలా ఇతడికి ఇలా !

journalist asked question Sunny Leone at garudavega pre release function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సన్నీ లియోన్… ఈ పేరు భారతీయ ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్య తరచుగా వినిపిస్తోంది. ఆ భాష, ఈ భాష అని లేకుండా సినిమా బిజినెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు దర్శకుడు, హీరో, హీరోయిన్ తర్వాత సన్నీ పాట వుందా అని అడగడం మామూలు అయిపోయింది. ఆమె పాట సినిమా బిజినెస్ ని ఎంతోకొంత ప్రభావితం చేస్తున్న మాట నిజం. అదీ ఇప్పుడు ఆమె స్టామినా. అందుకే సన్నీ ప్రభావాన్ని చూసే గరుడ వేగ సినిమాలో ఆమె పాట పెట్టడమే కాదు. ఆమె ని ప్రమోషన్ లోను భాగం చేస్తున్నారు. అయితే సన్నీ లియోన్ కి ఇక్కడ భిన్నమైన అనుభవాలు ఎదురు అవుతున్నాయి. ఆమెని ఎవరు ఎలా చూస్తున్నారు అనేదానికి ఈ మధ్య గరుడ వేగ ప్రమోషన్ లో జరిగిన ఓ సంఘటన అద్దం పడుతుంది.

గరుడ వేగ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సన్నీ లియోన్ ని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆమెకే కాదు చూసేవారికి కూడా మతిపోయింది. ఆ మహానుభావుడు ఏ మాత్రం సంస్కారం లేకుండా మిమ్మల్ని ఒక కోటి రూపాయలు ఇస్తావా,ముద్దు ఇస్తావా అని అడిగితే ఏమిస్తావ్ ? అని అడిగారు. ఆయన గారిని ఈ ప్రశ్న చూసాక జర్నలిస్ట్ అనడం కష్టంగా అనిపిస్తోంది. అయినా తప్పదు కదా. సదరు విలేకరి ఆ ప్రశ్న అడిగేటప్పుడు ఆయనకి వృత్తి నిబద్ధత ఎగిరిపోయింది . ఎదురుగా వున్న ఓ పోర్న్ స్టార్ ని చూసే కుర్రోడి పైత్యం ముందుకు వచ్చింది. ఈ ప్రశ్న అడిగే అతనికి సిగ్గు ఉన్నా లేకున్నా జవాబు చెప్పేందుకు సన్నీ ఇబ్బంది పడింది. అయితే అతని మీద సీరియస్ కావడం లాంటివి చేయకుండా నవ్వూతూ ఆ ప్రశ్న స్కిప్ చేసేసింది. ఇక అదే వేదిక మీదున్న జీవిత ఆ వాతావరణాన్ని చల్లబారుస్తూ ఓ అనాధ పిల్లని దత్తత తీసుకుని పెంచి ఆమెకి జీవితాన్ని ఇస్తున్న సన్నీ గొప్పదనాన్ని పొగిడింది. దీంతో సన్నీ భావోద్వేగంతో జీవితాన్ని దగ్గరికి తీసుకుంది. ఒకే వేదిక మీద వున్న ఒకే ఒక్క సన్నీ అతనికి అలా, ఈమెకి ఇలా కనిపించింది. అందుకే ఏదైనా చూసే కళ్లని బట్టే ఉంటుంది అంటారు కాబోలు.