సీఎం రమేష్ కు అలవాటైపోయిందా..?

Chandrababu is also serious about CM Ramesh.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కడప నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ కు ఈ మధ్య కాలంలో అందరితో అక్షింతలు వేయించుకోవడం అలవాటైపోయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య సన్మానానికి వైసీపీ నుంచి ఎవరూ రాలేదని విమర్శించేశారు. కానీ విషయం ఏంటంటే ఆ పార్టీకి లేటుగా ఆహ్వానం వెళ్లిందట. ఆ సంగతి సదరు పార్టీ అధికారికంగా వివరణ కూడా ఇచ్చింది.

అసలు విషయం తెలుసుకోకుండా నోరు జారడమెందుకని టీడీపీ సీనియర్లు సీఎం రమేష్ కు తలంటారట. రమేష్ ఈ ఒక్క విషయంలోనే కాదు రాయలసీమ ఇన్ ఛార్జ్ గా కూడా సరైన పనులు చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రత్యర్థులని తెలిసి, ఒకే ఒరలో రెండు కత్తులు పెట్టే పనులు చాలా చేశారాయన. అదేమంటే పార్టీ మంచి కోసమేనని బాబు ముందు కలర్ ఇచ్చారు.

ఇప్పుడు సీమలో చాలా నియోజకవర్గాల్లో గ్రూపులకు సీఎం రమేష్ తీరే కారణమని బాబుకు సమాచారం వెళ్లింది. దీంతో ఈ మధ్యే చంద్రబాబు కూడా సీఎం రమేష్ పై సీరియస్ అయ్యారట. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండి కొన్ని పనులు అప్పజెబితే ఇదేం నిర్వాకమని కడిగి పారేశారట. దీంతో మళ్లీ బాబు దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి తనకు అలవాటైన నోరుజారే వ్యవహారానికి దిగుతున్నారు రమేష్.

మరిన్ని వార్తలు:

లాలూ ర్యాలీలో ఆజాద్‌, మ‌మ‌త‌, అఖిలేశ్‌, శ‌ర‌ద్ యాద‌వ్‌

జ‌గ‌న్ ను డేరాబాబాతో పోల్చిన చంద్ర‌బాబు