వైసీపీ ఏడాది కిందట చెప్పింది బాబు ఇప్పుడు చేసి చూపిస్తాడా ?

chandrababu Naidu declares, TDP MPs to quit
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2018 కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఎప్పటిలాగానే తెలుగు రాష్ట్రాలకు నిరాశానిస్పృహలు మిగిల్చివెళ్ళింది. మరీ ముఖ్యంగా లోటు బడ్జెట్ తో ఆపసోపాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర ఆవేదన మిగిల్చింది. దీనిపై అధికార టీడీపీ రియాక్షన్ ఎలా వుండబోతోంది ? ప్రతిపక్ష వైసీపీ ఏ రచ్చ చేయబోతోంది ? అతి సాధారణమైన ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నాలుగు రకాలుగా ఆలోచించాల్సిన పరిస్థితి , రాజకీయ వాతావరణం ఇప్పుడు నెలకొంది.

2014 ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ కూటమికి ఎదురు నిలిచిన వైసీపీ విభజన హామీలన్నీ తుంగలో తొక్కినా కేంద్రం మీద నోరు ఎత్తడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మీద ఒత్తిడి చేస్తామని , అయినా బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తన ఎంపీ లతో రాజీనామా చేయిస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఇది హాట్ హాట్ ప్రకటన కాదు. 2017 బడ్జెట్ సమావేశాల్లోగా ప్రత్యేక హోదా రాకపోతే తన ఎంపీ లతో రాజీనామా చేయిస్తానని 2016 నవంబర్ లోనే జగన్ ప్రకటించారు. ఆ ప్రకటన ఎక్స్ పైరీ డేట్ అయిపోయి ఏడాది దాటింది. 2018 బడ్జెట్ కూడా వచ్చేసింది. అయినా వైసీపీ ఇప్పుడు ఆ మాటే మరిచిపోయి బీజేపీ భజనలో మునిగి తేలుతోంది. 2019 లో బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే చాలు అన్ని కష్టాల నుంచి గట్టెక్కుతామని వైసీపీ నమ్ముతోంది.అందుకే రాజీనామాల విషయం ఏంటని విలేకరులు అడుగుతుంటే జగన్ కుడి ,ఎడమ భుజాల్లాంటి విజయసాయి , సుబ్బారెడ్డి నంగినంగి మాటలతో అసలు విషయం దాటేస్తున్నారు. సుబ్బారెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి తాము రాజీనామా చేస్తే పార్లమెంట్ లో బీజేపీ ని ప్రశ్నించే దిక్కెవ్వరు అని చెబుతుంటే నవ్వొస్తోంది.

ఈ పరిస్థితుల్లో టీడీపీ కి కేంద్రాన్ని, బీజేపీ ని నిలదీయకపోతే రాజకీయంగా నిలువునా ఆరిపోతామని బాగా అర్ధం అయ్యింది. అందుకే బడ్జెట్ అయిపోగానే చంద్రబాబు కి అనుంగు అనుచరుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఒకటిరెండు రోజుల్లో కీలక నిర్ణయం ఉంటుందని తేల్చారు. ఆ నిర్ణయం బీజేపీ తో రాజకీయ తెగతెంపులు అని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. రాజకీయ తెగదెంపులతో ఆగకుండా కేంద్రంలోని టీడీపీ మంత్రులు,ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని అధినేత చంద్రబాబు మీద పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తోంది. చంద్రబాబు కూడా అందుకు దాదాపుగా ఓకే అన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే జగన్ ఏడాది కింద చెప్పిన మాటని చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నట్టే. .