ఆ కమెడియన్ కి బాబు థాంక్స్.

Chandrababu say thanks to comedian Venu Madhav

Posted September 13, 2017 at 17:25 
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున నాయకులకి అయితే కొదవ లేదు గానీ జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు చేసే వాళ్ళ లోటు కొంచెం వుంది. ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఆ లోటు పూడ్చాడు కమెడియన్ వేణు మాధవ్. ఏదో తన స్టైల్ లో కామెడీ పండిస్తాడులే అని ప్రచారానికి పిలిచిన చంద్రబాబు కూడా అనుకున్నారు. అయితే జరిగింది వేరు. నంద్యాల ప్రచారంలో వేణు మాధవ్ యాక్షన్ హీరో అయిపోయాడు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ ని, ఇంకో వైపు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాని షేక్ చేసాడు. తన దగ్గర డబ్బు, పత్రికలు, చానెల్స్ లేవంటూ జగన్ అబద్ధపు ప్రచారం చేస్తుంటే టీడీపీ నేతలు దాన్ని సరిగ్గా కౌంటర్ చేయలేకపోయారు. ఆ టైం లో సాక్షి పత్రిక, ఛానల్ ఎవరివి బట్టెబాజ్ అంటూ వేణుమాధవ్ చేసిన కామెంట్స్ నంద్యాల ప్రచారాన్ని వేడెక్కించాయి.ఆ కామెంట్స్ తర్వాత వైసీపీ శ్రేణుల నుంచి వేణు మాధవ్ తీవ్ర బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వేణు మాధవ్ వెనక్కి తగ్గలేదు. నంద్యాల లో టీడీపీ విషయానికి తన వంతు పాత్ర పోషించిన వేణు మాధవ్ ఈ రోజు అమరావతి వచ్చారు. సీఎం చంద్రబాబుని కలిసి అభినందనలు తెలిపారు. నంద్యాల ప్రచారం లో పాల్గొన్న వేణు మాధవ్ కి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు థాంక్స్ చెప్పారట. దీంతో పొంగిపోయిన వేణు మాధవ్ భవిష్యత్ లో కూడా పార్టీ అవసరాలకి తాను ముందు ఉంటానని బాబుకి మాట ఇచ్చి వచ్చారట.
మరిన్ని వార్తలు:

సంప‌న్న నేర‌స్థుల్లో రెండో స్థానంలో దావూద్

సింగ‌పూర్ కు మ‌హిళా అధ్య‌క్షురాలు

వాళ్లకి కూడా పరిటాల పెళ్లి పిలుపు.

SHARE