వైఎస్ఆర్ నా బెస్ట్ ఫ్రెండ్, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

chandrababu says ysr is my best friend

ప్రజావేదిక కూల్చివేతపై గురువారం అసెంబ్లీలోని ప్రశ్నోత్తరాల సమయంలో హాట్ హాట్‌గా చర్చలు జరిగాయి. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నిబంధనలను ఉల్లంఘించారని సీఎం జగన్ ఆరోపించగా.. ముఖ్యమంత్రి విమర్శలకు ప్రతిపక్ష నేత అంతే ఘాటుగా బదులిచ్చారు. మీరు నన్నేం చేస్తారో చేయండి. నాకేం బాధలేదన్న బాబు.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎన్ని పడటానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవసరమైతే రోడ్డు మీద పడుకొని పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ల నోళ్లను మూయించండని స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ ప్రశ్నకు అనుగుణంగా సమధానం చెప్పాలని మాత్రమే కోరుతున్నాను. సభా మర్యాదలను కాపాడుకోవాలని, సభా సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రంలోని మొత్తం అక్రమ కట్టడాల గురించి చర్చ జరుపుదాం. మీ నోరు మూయించాలని ఎవరికీ లేదు. ప్రశ్నలు అడగాలనుకున్న మిగతా నేతల పరిస్థితి ఏంటి..? అని స్పీకర్ ప్రశ్నించారు. మీరు డివియేట్ అయితే మాత్రం అందుకు అనుమతించనని చంద్రబాబుకు గవర్నర్ సూచించారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ప్రజావేదికను నిర్మించారని చెబుతున్నారు. మాజీ సీఎం అడిగారు కాబట్టి దాన్ని కూల్చారు. చట్ట వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డివి కొన్ని వేల విగ్రహాలు పెట్టారు. అలాంటి జగన్.. అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతున్నారా? నా ఆవేదనంతా 74 వేల మంది పేద ప్రజానీకం గురించి అధ్యక్షా అని చంద్రబాబు తెలిపారు. . వైఎస్ఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు,