మోడీని ఢీకొట్టడానికే బాబు డిసైడ్.

chandrababu-targeting-on-na

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

40 ఏళ్లుగా రాజకీయ ఎత్తులు, పై ఎత్తులతో రాటుదేలిన చంద్రబాబుకు అత్యంత కఠినమైన పరిస్థితులు ఇప్పుడు ఎదురు అవుతున్నాయి. అది కూడా ఆంధ్రప్రజలకు జీవనాడిగా నిలుస్తుందని భావిస్తున్న పోలవరం నిర్మాణం విషయంలో. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థి వైసీపీ నుంచి సానుకూలత ఆశించడం అత్యాశే.కానీ కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా లెక్కకు మించిన సవాళ్లు ఎదురు అవ్వడంతో చంద్రబాబు ఇబ్బందిపడుతున్నారు. అయితే మొదట్లో ఈ సమస్యను సహనంతో అధిగమించగలనని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ప్రత్యేక హోదా ని పక్కనబెట్టి ఎప్పుడైతే ప్యాకేజ్ కి ఓకే అన్నారో అప్పటినుంచి బీజేపీ నాయకత్వం నుంచి చిన్నచూపు పెరిగింది.

కేంద్రం అహంకార ధోరణి మీద పోరాడాలి అంటే సరైన కారణం కావాలి. అది లేకుండా పోరాడితే ఇటు కేంద్రం , అటు జనం ఆగ్రహం చూసే పరిస్థితి తప్పదు. నిజానికి కేంద్రం మీద చంద్రబాబు పోరాడే అవకాశాన్ని పోలవరం ద్వారా బీజేపీ నేతలే కల్పించారు. నిన్నమొన్నటిదాకా ఏ సమస్య వచ్చినా ఓపికగా పరిష్కారం కోసం చూసే బాబు పోలవరం విషయంలో మాత్రం రూట్ మార్చారు. నేరుగా ప్రజల ప్రయోజనాలతో ముడిపడిన అంశంలో పోరాటం చేయడం వల్ల కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగారు. పోలవరం ఆగే పరిస్థితి వస్తే ఎంత దూరం అయినా వెళతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఈ విషయంలో ప్రధాని మోడీ జోక్యం కోరుతున్నారు. అంటే నేరుగా మోడీతో ఢీకొట్టడానికి కూడా సిద్ధపడ్డారు. 2019 ఎన్నికల ముందు మోడీ , చంద్రబాబు పోలవరం అంశాన్ని ఎలా డీల్ చేస్తారు అన్నదాన్ని బట్టి వారి రాజకీయ వ్యూహాలు వుంటాయని చెప్పుకోవచ్చు.