ఢిల్లీకి ఏపీ సీఎం….ధర్నా చేసే అవకాశం !

TDP MPs attempt to protest in AP Special Status Demand near Modi residence

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను ఆయన కలవనున్నారు. హస్తినలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈవీఎంలు మొరాయించడం, సైకిల్ కు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై ఆయన ప్రశ్నించనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు, యనమల తదితర ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనకు రావాలని పలువురు మంత్రులకు కూడా పిలుపు వెళ్లింది. టీడీపీ ఎంపీలందరూ ఈ సందర్భంగా చంద్రబాబు వెంట ఉండనున్నారు. మరోవైపు, ఈసీ వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ రివ్యూ పిటిషన్ ను కూడా వేయబోతోంది.