కరోనా టెస్టు పేరుతో దోపిడి

కరోనా టెస్టు పేరుతో దోపిడి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా టెస్టు పేరుతో దోపిడి మొదలైంది. ఏకంగా ఎయిర్ పోర్ట్ అధికారులు, వైద్య సిబ్బంది విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులను నిలువు దోపిడీ వస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. విదేశాల నుండి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే RTPCR పరీక్షకు 750 రూపాయలు అవుతుంది. కానీ ఈ పరీక్షకు అయ్యే 750 రూపాయలకు బదులుగా నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

అయితే దీనిపై ప్రయాణికులు ఎయిర్‌పోర్టు సిబ్బందిని నిలదీశారు. ఇంత ఎక్కువగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ప్రయాణికులు ప్రశ్నించినందుకు వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ విధంగా 750 రూపాయల RTPCR టెస్టుకు నాలుగు వేల రూపాయలు తీసుకోవడమే కాకుండా దానికి సంబంధించిన రసీదును కూడా వైద్య సిబ్బంది జారీ చేస్తుంది. అక్కడ ఉన్న పోలీసులకు విషయం తెలిసి కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.