చిరుత అటాక్.. చిక్కినట్టే చిక్కి.. తప్పించుకొని దాడి

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో అటవీశాఖ అధికారులపై చిరుత దాడి కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లాలోని  మర్రిగూడ మండలం రాజాపేటలో వలలో చిక్కిన చిరుత తప్పించుకుంది. వలలో చిక్కినట్టే చిక్కుకుని తప్పించుకుపోయిన చిరుత.. ఫారెస్టు సిబ్బందిపై దాడి చేసి వారిని గాయ పరిచింది.

అదే విధంగా పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడ్డ సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అలాగే… రాజాపేట తండాలోని రైతు పొలంలో చిరుత ఈరోజు ఉదయం కనిపించింది. అది ఎలాగంటే… పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. పులి గాండ్రింపులకు రైతులు భయపడ్డారు. అయితే వలలో పులి చిక్కుకోవడంతో రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. అది మళ్లీ తప్పించుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. పులిని బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.