హరికృష్ణకి ఓటమి

హరికృష్ణకి ఓటమి

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఓపెన్‌ విభాగం నాలుగో రౌండ్‌ తొలి గేమ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణకు పరాజయం ఎదురైంది. అమిన్‌ (ఇరాన్‌)తో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 57 ఎత్తుల్లో ఓడిపోయాడు.

నేడు జరిగే రెండో గేమ్‌లో హరికృష్ణ తప్పనిసరిగా గెలిస్తేనే టోర్నీలో నిలుస్తాడు. మరోవైపు విదిత్‌ (భారత్‌) 49 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌)తో జరిగిన తొలి గేమ్‌ను ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.