పనీర్ స్థానంలో చికెన్‌.. జొమాటోకు రూ. 55 వేల ఫైన్‌

Chicken in place of paneer

పనీర్ బట్టర్‌ మసాలా స్థానంలో బట్టర్‌ చికెన్‌ను సర్వ్‌ చేసిందుకు వినియోగదారుల కోర్టు జొమాటోతో పాటు ఆ ఆహారాన్ని సర్వ్‌ చేసిన హోటల్‌కు భారీగా జరిమానా విధించింది. పుణెకు చెందిన శణ్ముఖ్‌ దేశ్‌ముఖ్‌ అనే న్యాయవాది పనీర్ బట్టర్‌ మసాలా కోసం జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేశాడు. కానీ పనీర్ బట్టర్‌ మసాలా స్థానంలో బట్టర్‌ చికెన్‌ను సర్వ్‌ చేశారు. పనీర్ మాదిరిగానే చికెన్‌ కూడా ఉండడంతో.. నాన్‌వెజ్‌ను తినేశాడు లాయర్‌. ఆ తర్వాత అది చికెన్‌ అని తాను గుర్తుపట్టాడు. దీంతో జొమాటోతో పాటు ఆ హాటల్‌పై వినియోగదారుల కోర్టులో న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. శాఖాహారానికి బదులుగా మాంసాహారాన్ని సర్వ్‌ చేసినందుకు జొమాటోతో పాటు ఆ హోటల్‌కు రూ. 55 వేల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది.