చిరు 152వ చిత్రం.. ఆసక్తికర పుకారు

chiranjeevi-152-movie-with-director-trivikram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం విడుదలై దాదాపు సంవత్సరం కాబోతుంది. ఇప్పటి వరకు ఆయన 151వ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లలేదు. చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ని చేస్తున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా చిరంజీవి లుక్‌ ఫైనల్‌ కాకపోవడంతో షూటింగ్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. సంక్రాంతి తర్వాత షూటింగ్‌ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 2018 సంక్రాంతి తర్వాత షూటింగ్‌ ప్రారంభం అయ్యి, 2019 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. 151వ చిత్రం ఇంకా ఏదీ కానే కాలేదు అప్పుడే చిరు 152వ చిత్రం గురించిన వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి 152వ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తాడని, పవన్‌ కళ్యాణ్‌ ఆ సినిమాను నిర్మిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు చిరు 152వ చిత్రాన్ని అల్లు అరవింద్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మిస్తాడని ప్రచారం జరిగింది. కాని తాజాగా మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో చిరంజీవి 152వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ నిర్మించబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. 2018 చివర్లో సినిమాను మొదలు పెట్టి 2019 వేసవిలో విడుదల చేసేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చిరు 152వ చిత్రానికి పవన్‌ కేవలం నిర్మాతగానే కాకుండా ఆ సినిమాలో కీలక పాత్ర కూడా పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవితో కలిసి పవన్‌ నటించాలని మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక ఈ చిత్రంతో నెరవేరే అవకాశం ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్‌ ఒక స్టోరీ లైన్‌ను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌తో ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్‌ ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయితే చిరంజీవి 152వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ నెత్తికి ఎత్తుకుంటాడు అంటూ సమాచారం అందుతుంది. ఇక చిరు 152వ చిత్రాన్ని పవన్‌తో కలిసి అశ్వినీదత్‌ కూడా నిర్మించబోతున్నట్లుగా ఒక వర్గం వారు అంటున్నారు. మొత్తానికి ఈ వార్తలు మెగా ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపుతున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.