జగన్ ఆ శాస్త్రాన్ని కూడా నమ్మేస్తున్నాడా.

jagan mohan reddy name got changed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వరసగా అపజయాలు ఎదురు అవుతున్నప్పుడు, చేసే పని మీద గురి కుదరనప్పుడు కొత్త కొత్త నమ్మకాలు, విశ్వాసాలు పుట్టుకొస్తాయి. అభద్రతా భావంలో ఉన్నప్ప్పుడు లాజిక్ పక్కకి వెళ్ళిపోయి సమస్య నుంచి బయటపడాలనే ఆశ మాత్రమే మనిషిని నడిపిస్తుంది. ఈ దశలో ఆలోచనల కన్నా అంతిమంగా కావాల్సిన ఫలితం మీదే దృష్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మనిషిని ఆకట్టుకోవడం, అతని బలహీనత మీద ఆడుకోవటం చాలా సులభం. ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నారేమో వైసీపీ అధినేత జగన్ అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వున్న ఆయన్ని తలో మాట చెప్పి వంగదీస్తున్నారు కొందరు స్వామీజీలు. ముహుర్తాలు,ఇతరత్రా పూజలు అంటూ ఆయన ప్రతిదానికి తమ సలహాలు అడిగేలా ఓ వాతావరణం సృష్టిస్తున్నారు. సహజంగా ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని లైట్ గా తీసుకోలేకపోతున్నారు. ఈ స్వామీజీలకు తోడు ఇప్పుడు ఇంకో శాస్త్రం తెలిసిన పెద్దాయన కూడా వైసీపీ కోటరీకి చేరాడంట. అక్కడ ఆయన ఏమి చేస్తున్నాడో చూద్దాం.

Image result for jagan mohan

2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం వ్యూహ లోపం కాదట. ప్రజాబలం ఉన్నప్పటికీ జగన్ అనే పేరు అచ్చి రాలేదని నామ శాస్త్రం పేరు చెప్పి నామాలు పెట్టడానికి రెడీ అయిపోయాడు. జగన్ ని ఆ పేరుతో కాకుండా జేఎమ్మార్ అనే పేరుతో పిలిస్తే బాగా కలిసి వస్తుందని సదరు పండితుడు చెప్పిన మాట పట్టుకుని పాదయాత్ర టైం లో వేసే పోస్టర్స్,ఫ్లెక్షీ ల మీద కొత్త పేరు వేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు జగన్ కోటరీలో కొందరు నాయకులు. ఈ విషయం జగన్ దాకా కూడా వెళ్ళింది అంటున్నారు. పేరు అస్తిత్వానికి చిహ్నం. అధికారం కోసం దాన్ని కూడా మార్చుకోడానికి సిద్ధపడటమంటే అది బలమో, బలహీనతకి సంకేతమో జగన్ ఆలోచించుకోవాలి. ఇలాంటి సందిగ్ధ అవస్థల్ని పట్టుకుని సొంత పబ్బం గడుపుకునే వారిని పక్కనబెట్టకపోతే అసలుకే ఎసరు తప్పదు.