మెగా స్టార్ చిరంజీవిని చుసిన ఫాన్స్ కి షాక్

నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా కోట్ల మైదానంలో వినయ విధేయ రామ ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ కి సినిమా ప్రముఖులు, మరియు రాజకీయ నాయకులూ అతిధులుగా విచేశారు. ఈ ఆడియో ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎందుకు అంటే ఖైది నెంబర్ 150 సినిమా అప్పుడు చిరు చాలా లావుగా ఉన్నారు. కానీ తన తరువాత సినిమా సైరా కోసం చాలా సన్నబడ్డారు. నిన్న ఆడియో ఫంక్షన్ లో చిరుని చుసిన మెగా ఫాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒక్కనొక సందర్బంలో కేటిఅర్ గారు చిరంజీవి, చరణ్ అన్నతమ్ములు లాగా ఉన్నారు అన్నారు.

చిరంజీవి సైరా లో వీర యోధుడు పాత్రలో కనిపిస్తారు అందుకోసం అన్నయ్య జిమ్ లో స్పెషల్ ట్రైనర్స్ అధ్వర్యంలో తన బాడీ మొత్తం తగించేశారు. అన్నయ్యను చూస్తే మాత్రం ఓ కుర్రవాడిలగా ఉన్నారు. మొదట తన లుక్ ను బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ చరణ్ ఆడియో ఫంక్షన్ వలన తప్పలేదు. సైరా తరువాత కొరటాల శివతో ఓ సినిమా మొదలవ్వబోతుంది. కొరటాల చిరుతో ఓ సోషల్ ఓరియెంటెడ్ మూవీ ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ఆ చిత్రంలో రైతు గా నటిస్తాడని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్. రామ్ చరణ్ వినయ విధేయ రామ షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదలవుతుంది.