‘సైరా’ ఫస్ట్‌లుక్‌ వార్త వచ్చేసింది

Chiranjeevi Sye Raa Movie Latest Updates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రంగస్థలం సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెద్ద ఎత్తున యుద్ద సన్నివేశాలు మరియు పెద్ద పెద్ద సెట్టింగ్స్‌తో ఈసినిమా బాహుబలి చిత్రాన్ని తలపిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని ఏకంగా 150 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళిక సిద్దం చేశాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీయాలని, బాహుబలి స్థాయిలో నిలిచి పోయేలా ఉండాలంటూ దర్శకుడు సురేందర్‌ రెడ్డితో చరణ్‌ అంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గురించిన వార్తలు మీడియాలో వస్తున్నాయి.

ఇప్పటి వరకు సైరా ఫస్ట్‌లుక్‌ గురించిన చర్చ జరగలేదు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలపై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. రామ్‌ చరణ్‌కు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ‘సైరా’ ఫస్ట్‌లుక్‌ను ఆగస్టులో చిరంజీవి బర్త్‌డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అదే సమయంలో సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లుగా ఆయన హిట్‌ ఇచ్చాడు. ఫస్ట్‌లుక్‌ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహకంగా ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబచ్చన్‌ను నటింపజేస్తున్నారు. తమిళం కోసం విజయ్‌ సేతుపతిని, కన్నడం కోసం సుదీప్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. నాలుగు సౌత్‌ భాషతో పాటు హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది.