థమన్‌ చేతుల్లోకి సైరా ప్రాజెక్ట్‌

Thaman Get chance as Music Director For Sye raa Narasimha Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని చరణ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల దాదాపు మూడు నెలల పాటు ఆలస్యం అయ్యింది. షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో సినిమాకు మొదట ఓకే చెప్పిన కొందరు టెక్నీషియన్స్‌ డేట్‌ క్లాస్‌ అవుతున్నాయి అంటూ తప్పుకున్నారు. ఇప్పటికే సినిమాటోగ్రఫర్‌ మరియు సంగీత దర్శకుడు సినిమా నుండి తప్పుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ సినిమా నుండి తప్పుకోవడంతో సినిమా స్థాయి సగానికి పడిపోయినట్లుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది.

Chiranjeevi-Sye-raa-Narasim

రహమాన్‌ స్థాయిలో ఈ సినిమాకు సంగీతాన్ని అందించగల సత్తా ఎవరికి ఉందని, ఆ రేంజ్‌లో సైరా కోసం వాయించడం ఎవరి వల్ల కాదని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా భావిస్తున్నారు. అయితే పోయిన ఏఆర్‌ రహమాన్‌ను తీసుకు రావడం సాధ్యం కాని పని, అందుకే ఆయన స్థానంలో థమన్‌ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. థమన్‌ సంగీతంపై బ్యాడ్‌ కామెంట్స్‌ ఉన్నా కూడా ప్రస్తుతం చిత్ర యూనిట్‌ సభ్యుల ముందు థమన్‌ మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ మద్య చిరంజీవి సినిమాకు సంగీతం ఇచ్చే ఛాన్స్‌ను ఇస్తాను అంటూ థమన్‌కు చరణ్‌ హామీ ఇచ్చాడు. అయితే సైరా పెద్ద ప్రాజెక్ట్‌ అవ్వడంతో రహమాన్‌కు ఇవ్వడం జరిగింది. రహమాన్‌ తప్పుకోవడంతో మాట ప్రకారం థమన్‌కు చిరంజీవి ‘సైరా’ చిత్రం సంగీతాన్ని అందించే అవకాశం థమన్‌కు దక్కింది. ఇప్పటికే టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌కు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను థమన్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. థమన్‌ సంగీతంతో సినిమాను ఏ రేంజ్‌కు తీసుకు వెళ్తాడు అనేది వేచి చూడాలి. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కాబోతుండగా, త్వరలోనే సైరా కోసం ట్యూన్స్‌ను సిద్దం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.