‘సైరా’కు అడ్డంకులు, వారంలో 50 లక్షలు వృదా

Sye Raa narasimha reddy Movie Lose Rs. 50 lakhs Due to Rain

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మిస్తుండగా, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్రంకు సంబంధించిన టాకీ పార్ట్‌ సీన్స్‌ చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం కోకాపేట సమీపంలో ఓపెన్‌ ప్లేస్‌లో వందలాది మంది జూనియర్‌ ఆర్టిస్టులతో యుద్ద సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశారు. ఈ సన్నివేశాల కోసం ఇంగ్లాండ్‌ నుండి కూడా పలువురు జూనియర్‌ ఆర్టిస్టులను చిత్ర యూనిట్‌ సభ్యులు రప్పించడం జరిగింది. అయితే వారం రోజుల నుండి కూడా హైదరాబాద్‌లో వర్షం వస్తూనే ఉండటంతో షూటింగ్‌కు అంతరాయం కలుగుతుంది.

షూటింగ్‌ను వర్షం సమయంలో చేయలేక పోతున్నారు. వర్షం కారణంగా వారం రోజులుగా షూటింగ్‌ను వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ చిత్రం కోసం వేసిన సెట్టింగ్స్‌ కూడా వర్షం వల్ల నాశనం అవుతున్నాయి. ఇక రోజు చిత్రీకరణ కోసం వందల సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులతో పాటు, పలువురు సీనియర్‌ ఆర్టిస్టులను తీసుకు రావడం, వారు ఊరికే ఉండటం జరిగింది. వారందరి కాల్షీట్లు వృదా అవ్వడంతో పాటు, నిర్మాణ వ్యయం కూడా వృదా అవుతుందని ప్రొడక్షన్‌ టీం ఆందోళన చెందుతుంది. దాదాపు వారం రోజుల్లో 50 లక్షల వరకు వృదా అయినట్లుగా వారు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు అంటున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంకు 50 లక్షల వృదా అనేది పెద్ద సమస్య కాదు. కాని సమయం ఎక్కువగా వృదా అవుతుందనేది కొందరి వాదన. మొత్తానికి సైరా చిత్రానికి వరుణుడు ఇబ్బందికరంగా మారాడు. మరి ఈ రోజు నుండైనా షూటింగ్‌ జరుగుతుందేమో చూడాలి. వాతావరణ శాఖ మాత్రం మరో మూడు నాలుగు రోజుల వరకు వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు.