వయస్సు తగ్గించుకునే ప్రయత్నాలు

Chiranjeevi to Go for Naturopathy Treatment

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ రెండవ షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మొదటి షెడ్యూల్‌ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు త్వరలో మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి లుక్‌ చాలా విభిన్నంగా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. ఇక గత కొన్ని వారాలుగా చిరంజీవి వైజాగ్‌లో ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరంజీవి వయస్సు తగ్గించుకునేందుకు వైజాగ్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతుంది.

వైజాగ్‌కు చెందిన ఒక టీడీపీ లీడర్‌ సలహా మేరకు చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పలువురు చర్మంపై ముడతలు తొలగించుకోవడంతో పాటు, స్క్రిన్‌లో గ్లోను పెంచుకునేందుకు ఆ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారని, మంచి ఫలితాలు వచ్చాయట, అందుకే చిరంజీవి కూడా ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లుగా చెబుతున్నారు. వరుసగా మూడు నెల పాటు ఆ చికిత్స తీసుకోవాలని, ఖచ్చితంగా పది సంవత్సరాలు వయస్సు తగ్గి కనిపిస్తారని చెబుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌ ఇదే తరహా ట్రీట్‌మెంట్‌ను విదేశాల్లో తీసుకున్నారు. వైజాగ్‌లో అత్యాధుకిన టెక్నాలజీతో ఈ ట్రీట్‌మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు.