చిరంజీవికి కలిసి రాని రాజకీయాలు

చిరంజీవికి కలిసి రాని రాజకీయాలు

టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారో మనందరికి బాగా తెలుసు. కష్టపడి తాను అనుకున్నది సాధించుకున్న వారిలో చిరంజీవి ది బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పుకోవచ్చు. చిరు నటనకు ఒక్క టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే ఆ అభిమానం వెనుక ఎంతటి కష్టం దాగి ఉందో పైకి కనపడదు.అయితే సినిమా లైఫ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలలోకి అడుగుపెట్టిన చిరంజీవికి మాత్రం అది కాస్త కలిసి రాలేదనే చెప్పాలి. అయితే తిరిగి మళ్ళీ సినీ రంగంలోకి అడుగుపెట్టిన చిరు కొద్ది రోజుల నుంచి రాజకీయాలకు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు.

అయితే చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలని ఆయన బావమరిది అల్లు అరవింద్ కోరుతున్నారు. అయితే ఇదేదో రీల్ లైఫ్‌లో అనుకుంటే మాత్రం పొరపాటే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవిని ఇంకా ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానమిస్తూ చిరు రాజకీయాలలో ఏ స్థాయికి వెళ్తారనేది ఊహించలేను కానీ ఆయనను ప్రెసిడెంట్ ఆఫ్‌ ఇండియాగా చూడాలని ఉందని అది నా డ్రీమ్ అని అన్నారు. అయితే రాష్ట్రపతి పదవి అనేది చాలా గొప్ప అవకాశం. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవికి ఆ పదవి దక్కడం అంటే అంత అషామాషీ కాదు. అయితే అల్లు అరవింద్ కోరుకున్నట్టు ఆ పదవి భవిష్యత్తులో అయినా చిరంజీవికి దక్కుతుందా లేదా అనేది చూడాలి మరీ.