బీజేపీ కి బాబు గుడ్ బై కొట్టేస్తున్నట్టే.

cm chandrababu master plans for 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

ఏ విషయం మీద జనం లో చర్చ జరగాలి అని సీఎం చంద్రబాబు అన్నారంటే దానికి సంబంధించి ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారనే అర్ధం. ఆ నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నం చేస్తారు. సదరు టాపిక్ మీద ఆంధ్రజ్యోతేలో కధనం వస్తుంది. దాని మీద బాబు స్పందిస్తారు. ఇలా ఓ వ్యూహం, ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఇలాంటిదే ఓ రాజకీయ నిర్ణయానికి ప్రజా మద్దతు కూడగట్టే పని మొదలైంది. బీజేపీ కి గుడ్ బై కొట్టేందుకు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు అందుకు అవసరమైన రంగం సిద్ధం చేస్తున్నట్టు అనిపిస్తోంది.

bjp

ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికి రాదని టీడీపీ నేతలు ఊదరగొట్టారు. విపక్షం కూడా సొంత అవసరాల కోసం గట్టిగా పోరాడే పరిస్థితి లేకపోవడంతో కేంద్రం ఆ అంశాన్ని తేలిగ్గా పక్కన పడేసింది. ఇక ప్యాకేజ్ ప్రకటన అయితే వచ్చింది కానీ దానికి ఇప్పటికీ చట్టబద్ధత లేదు. ఇప్పుడు పోలవరానికి కూడా కేంద్రం కొర్రీలు పెడుతోంది. ఇక దేశవ్యాప్తంగా కూడా మోడీ సర్కార్ మీద వ్యతిరేకత ఇప్పుడిప్పుడే బయటకు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా , ప్యాకేజ్ అంశాలను ఆంధ్రజ్యోతి, చంద్రబాబు ఒకే రోజు ప్రస్తావించడం కాకతాళీయం కాకపోవచ్చు.

chandra-babu-naidu

ఆర్ధిక మండలి ని బూచిగా చూపి ఏపీ కి కేంద్రం ప్రత్యేక హోదా పక్కనబెట్టింది. అదే ఆర్ధిక మండలి సభ్యుడు ఎం . గోవిందరావు ఆంధ్రజ్యోతి కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ప్రత్యేక హోదా కి తాము అభ్యంతరం చెప్పలేదని, కేంద్రం కావాలి అనుకుంటే ఇవ్వొచ్చని తేల్చి చెప్పారు. అదే సమయంలో హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని చంద్రబాబు అసెంబ్లీలో లేవనెత్తారు. ఆ పోరాటం చేసేవాళ్ళు ఢిల్లీలో చేయాలంటూ ఆ తప్పును కేంద్రం మీదకు వేసేసారు. ఇక కేంద్రం హోదా ఇవ్వడం లేదనే ప్యాకేజ్ కి ఒప్ప్పుకున్నట్టు కూడా ఆయన వివరణ ఇచ్చారు. హోదాకు అవకాశం ఉందన్న వార్త ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా రాయడం చూస్తుంటే మోడీ సర్కార్ తో చంద్రబాబు యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టే అనిపిస్తోంది.

tdp-and-bjp

వైసీపీ అధినేత జగన్ సైతం హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నా తనకున్న కేసుల వల్ల కేంద్రంతో గట్టిగా పోరాడలేని పరిస్థితి. ఇక టీడీపీ సర్కార్ గట్టిగా మాట్లాడితే వచ్చే నిధులు కాస్త ఆగిపోతాయని భయం. అయితే ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ సీన్ మారిపోతోంది. దేశ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గుతున్న విషయాన్ని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ మీద పెరిగిన కోపం ప్రభావం తమ మీద పడకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతున్నారు. హోదా అంశంలో తమ తప్పు లేదని చెప్పడంతో పాటు 2019 ఎన్నికలకు బీజేపీ నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తున్నారు. అందుకు సంకేతాలే తాజా పరిణామాలు అనుకోవచ్చు.

chandra-babu-and-modi