సీరియస్ గా ఉన్న వైఎస్ జగన్

సీరియస్ గా ఉన్న వైఎస్ జగన్

కరోనా విషయంలో ఒకప్పుడు పోగొట్టుకున్న గ్రాఫ్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ టెస్టులు భారీ ఎత్తున చేయించి తెచ్చుకున్నారు. టెస్టులు చేశారు కానీ చికిత్స ఇచ్చి కరోనాను నిలువరించి ఆపగలిగే అంశంలో విఫలం అయ్యి మళ్లీ గ్రాఫ్ పోగొట్టుకున్నారు.

అయితే ఇప్పుడు కరోనా విషయంలో నిర్వహించిన సరికొత్త భేటీలో వై ఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి కరోనా కు చికిత్స అందించనున్న ఆసుపత్రుల సంఖ్యలో మరో 45 ఆసుపత్రులను పెంచాలని వాటి ద్వారా మరింత మందికి చికిత్స అందివ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు.

అంతే కాకుండా ప్రస్తుతానికి 130కి పైగా ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని ఇక అలాగే రాబోయే 6 నెలల్లో కరోనా వైద్యానికి 1000 కోట్లు ఖర్చు పెట్టనున్నామని వారు తెలిపారు.మొత్తానికి మాత్రం కరోనా విషయంలో అధికారులతో జగన్ కాస్త సీరియస్ గానే ఉన్నారని చెప్పాలి.