నీవు నేర్పిన విద్యయేగా నీరజాక్షా !

CM KCR serious On RTC unions over RTC Strike

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జూన్ 11 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల పై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇవ్వడం బాధ్యతారాహిత్యమని, ఆర్టీసీ కార్మిక సంఘాలు తక్షణమే సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల్లోంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అసమంజసమైన కోరికల వల్ల ఆర్టీసీకి ఏటా మరో రూ.900 కోట్ల నష్టాలు వస్తున్నాయని, స్వలాభం కోసం కొందరు చెప్పే మాటలు నమ్మి.. కార్మికులు నష్టపోవద్దని సూచించారు. సమ్మె చేస్తే ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందన్నారు. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే “తెలంగాణ మజ్దూర్ యూనియన్” టీఎంయూ… తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం. తెలంగాణా ఉద్యమ సమయంలో భాగంగా పురుడు పోసుకున్న సంస్థ. ప్రస్తుత మంత్రి హరీష్ రావు దీనికి గౌరవాధ్యక్షుడు. అంటే.. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం. ఈ కార్మిక సంఘమే ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకి పిలుపునిచ్చింది. కేసీఆర్ మాత్రం…అనుబంధ కార్మిక సంఘ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోకుండా వార్నింగ్‌లు ఇస్తున్నారు. కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపు కోసమే యూనియన్ నాయకులు.. ఇప్పుడు సమ్మె పిలుపునిచ్చారని కేసీఆర్ తేల్చేశారు. సొంత ప్రయోజనాల కోసం సంస్థ ఊపిరి తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు చెబుతున్నట్టు ఆర్టీసీని ఆర్టీసీగానే చూసి ఉంటే ఆ సంస్థను కేసీఆర్ ఎలా భాగం చేసారు మరి ? ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పులఊబిలో కూరుకున్న ఆర్టీసీపై.. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బంద్‌లు, సకలజనుల సమ్మెలు.. తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అప్పటి వరకూ… తమ సంస్థ, తమ కార్మిక సంఘం అన్నట్లుగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మికులందర్నీ తెలంగాణ పేరుతో విడగొట్టేసి.. కొత్త సంఘం పెట్టించేసి.. హరీష్ రావు నేతృత్వంలో తెరాస చేసిన రాజకీయాన్ని ఎవరు మర్చిపోగలరు. ఇప్పుడు ఆ కార్మిక సంఘమే కేసీఆర్‌కు ఏకు మేకై కూర్చుంది. కార్మికసంఘం బాధ్యతారాహిత్యగా వ్యవహరిస్తున్నారు అని కేసీఆర్ పెర్కొనుంటూన్నారు. కానీ ఇదంతా వారు ఎవరిని చూసి నేర్చుకున్నారు. అప్పట్లో ఉద్యమం కోసం ఆర్టీసీని సమ్మె బాట పట్టించారు, ఆవిధంగా పోరాడితే తెలంగాణనే వచ్చింది.. తమ సమస్యలు పరిష్కారం కావా అన్న స్ఫూర్తిని నింపింది టీఆర్ఎస్‌. ఇప్పుడు ఆ టీఆర్ఎస్‌కే అనుబంధ సంఘంగా ఉన్న కార్మిక సంఘం… బంద్‌ల పేరుతో.. ఉద్యమం చేయడం పెద్దగా ఆశ్చర్యపడే విషయమేమీ కాదు. వ్యవస్థలనే ధిక్కరించి చేసిన తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మెలు ఇప్పుడు యా ఉద్యమాలు సమ్మెలు నేపధ్యంతో పుట్టుకొచ్చిన కార్మిక సంఘాలు ప్రభుత్వాలకు భయపడతాయని కేసీఆర్ ఎలా అనుకుంటున్నారో ? అలాంటి నేపధ్యం కల వారిని సామరస్యంగా చర్చలతో సాల్వ్ చేసుకోవాలి కానీ కీసీఅర్ మారం బెదిరిస్తే పనులు జరిగిపోతాయి అనుకుంటున్నారు.