మహాకూటమా…గూటమా….కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు…!

CM KCR Strong Warning To AP CM Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘తెలుగు పేరు మీదనే కదా మా కొంప ముంచుకున్నది. ‘తెలుగు తల్లి, తెలుగు భాష’ అని అరవై ఏళ్లు మమ్మల్ని దోచుకున్నారు. దోస్తీ కలుద్దామని చంద్రబాబు అడిగాడని చంద్రబాబునాయుడూ.. నీతో పొత్తా.. ఛీ ఛీ. బతికుండగా కలవం. నీ అడుగుపడితే పచ్చటి చెట్టు కూడా భస్మమైపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెగ్ నీది. నీ దోస్తీ మాకెందుకు?.. మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలవకుంటే మహాకూటమి వచ్చిందంటాడు. మహాకూటమా? గూటమా?, నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎన్నికల రంగంలో నీ దమ్మేందో, మా దమ్మేందో తేల్చుకుందాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ లేరు’ అని కేసీఆర్ అన్నారు.

kcr-chandrababu

చంద్రబాబునాయుడిని తాను వేధిస్తున్నానట, ఎవడు వేధిస్తున్నాడు? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘నువ్వు చక్కటి మనిషివని నిన్ను వేధిస్తున్నారు! ఓటుకు నోటు దొంగతనం నిజం కాదా? ఓ బుడ్డెరఖాన్ ని నువ్వు పంపితివి..వాడు దొరికే! అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా? ఇంకా, నిన్ను ఏం వేధిస్తున్నారు బిడ్డా?’ అని చంద్రబాబుని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు తొమ్మిదేళ్లు దత్తత తీసుకుని ఏమీ చేయలేదని సీఎం ‘గుండెల మీద గుద్దాడు! పునాదిరాళ్లు పాతిపోయాడు. పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడల్లా నేను ఉపన్యాసాల్లో చెప్పేది ఈ సమైక్య పాలకులు పాతిన పునాదిరాళ్లను తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది. శిలాఫలకాలు వేశారు తప్ప, పనులు చేయలేదు. ఇటువంటి దుర్మార్గుడు. ఈరోజున తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి చంద్రబాబునాయుడును తెస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ ఆంధ్రా వాళ్లకు అప్పగిస్తామా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలా? ఢిల్లీలో జరగాలా? పట్టువీడితే ఉన్న గోసీ ఊడిపోతుంది. మళ్లీ మొదటికొస్తాం, మళ్ళీ ఆగమైపోతాం మీ బిడ్డగా మనవి చేస్తున్నా ఏమరుపాటుగా ఉంటే ఈ గద్దలు మళ్లీ తన్నుకుపోతే మళ్లీ భయంకరమైన పరిస్థితులొస్తాయని ఆయన హెచ్చరించారు.

kcr-speech