సునీల్‌ రెండు పడవల ప్రయాణం

Sunil again to acts in Veerabhadram Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కమెడియన్‌గా ఎన్నో కష్టాలు పడి చివరకు స్టార్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు సునీల్‌. స్టార్‌ హీరోల చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో, కమెడియన్‌ పాత్రల్లో అవకాశాలు వస్తున్న సమయంలోనే సునీల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మొదట మంచి సక్సెస్‌లు దక్కాయి. హీరోగా సెటిల్‌ అయినట్లే అని భావిస్తున్న సమయంలోనే వరుసగా ఫ్లాప్‌లు పడుతూ వచ్చాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా సునీల్‌కు సరైన సక్సెస్‌ లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా నటించేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం అయిదు స్టార్‌ హీరోల చిత్రాల్లో సునీల్‌ కమెడియన్‌ పాత్రలను పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒక వైపు కమెడియన్‌గా నటిస్తూనే మరో వైపు హీరోగా కూడా ప్రయత్నాలు చేయాని నిర్ణయానికి వచ్చాడు. గతంలో వీరభద్రం దర్శకత్వంలో సునీల్‌ హీరోగా పూలరంగడు చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. మళ్లీ అదే కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతుంది. ‘భాయ్‌’ చిత్రం ఇచ్చిన స్ట్రోక్‌తో వీరభద్రం మరో సినిమా అవకాశం దక్కించుకోలేక పోయాడు. ఇన్నాళ్లకు సునీల్‌ కోసం ఒక మంచి కథను సిద్దం చేయడంతో ఒక నిర్మాత ముందుకు వచ్చాడు.

అంజిరెడ్డి అనే నిర్మాత సునీల్‌, వీరభద్రంల కాంబినేషన్‌లో సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్న ఈ చిత్రంను అతి త్వరలోనే సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. 8 కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఒక వైపు కమెడియన్‌గా మరో వైపు హీరోగా చేయడం అంటే సాహసమే. మరి సునీల్‌ రెండు పడవల ప్రయాణం ఏ తీరం చేరునో చూడాలి.