ఇద్దరికి కీలకం… ఏమవుతుందో?

Allari Naresh and Sunil hope on Silly Fellows movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మినిమం గ్యారెంటీ హీరో అల్లరి నరేష్‌ ఈమద్య ఒక్క సక్సెస్‌ను కూడా దక్కించుకోలేక పోతున్నాడు. ‘సుడిగాడు’ చిత్రం తర్వాత చేసిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్‌ అవుతూనే ఉన్నాయి. ఈయన చేస్తున్న సినిమాలు మునుపటి మాదిరిగా ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. దాంతో అల్లరి నరేష్‌ సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. ఈ సంవత్సరంలో ఈయన చేస్తున్న సినిమాకు ‘సిల్లీఫెలోస్‌’ అనే టైటిల్‌ ఖరారు అయ్యింది. భీమినేన శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్‌ ఒక కీలక రోల్‌లో కనిపించబోతున్నాడు. కీలక రోల్‌ అనడం కంటే మరో హీరోగా అనడం బెటర్‌ అంటూ సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. చిన్న రేంజ్‌ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం కామెడీని కోరుకునే ఆడియన్స్‌ ఎదురు చూస్తున్నారు.

హీరోగా పలు ప్రయత్నాలు చేసిన సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో కమెడియన్‌గా కూడా నటిస్తున్నాడు. ఈ సమయంలోనే భీమినేని నుండి సునీల్‌కు ఈ ఛాన్స్‌ రావడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. అల్లరి నరేష్‌ మరియు సునీల్‌లకు ఈ చిత్రం సక్సెస్‌ అనేది చాలా చాలా కీలకం. వీరిద్దరు కూడా ప్రస్తుతం చాలా దీనమైన, హీనమైన కెరీర్‌ను అనుభవిస్తున్నారు. అందుకే ఈ చిత్రం వీరిద్దరికి సక్సెస్‌ను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నారు. ‘సుడిగాడు’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు భీమినేని మరోసారి అదే తరహా స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సుడిగాడుకు సీక్వెల్‌ అంటూ మొదట ప్రచారం జరిగింది. కాని సిల్లీ ఫెలోస్‌ అంటూ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఆసక్తిని కలిగిస్తుంది. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందా అనేది చూడాలి.