వారంతా ఉగ్రవాదులు, తీవ్రవాదులు….ఐవీఆర్ కళ్ళు తెరిపించాడుగా !

iyr krishna rao on ramanadeekshithulu ys jagan meet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజులుగా ఆంధ్రాలో ఆపరేషన్ గరుడ పేరు బాగా వినిపిస్తోంది. సినీ నటుడు మాజీ బీజేపీ నేత శివాజీ మొదట ఈ ఆపరేషన్ గరుడ అంశాన్ని తెరమీదకు తెచ్చాడు. అది నిజమో ఊహాతీతమో తెలీదు కానీ అచ్చు శివాజీ చెప్పినట్టుగానీ అన్నీ జరగడం ఇప్పుడు అందరిలోనూ ఆ ఆపరేషన్ గరుడ నిజమేనేమో అనే అనుమానాలని కలిగిస్తోంది. రోజు రోజుకి ఊహలకందని మలుపులు తిరుగుతున్నాయి ఏపీ రాజకీయాలు. జగన్ అంటేనే అవినీతికి కీరఫ్ అడ్రెస్ అని బాబుతో కలిసినుప్పుడు కామెంట్స్ చేసే పవన్ కళ్యాణ్ ఇప్పడు జగన్ మీద పల్లెత్తు మాట కూడా అనడంలేదు.

అలాగే కులాల మీద గొడవలు రేపడానికేనా అన్నట్టు ఒకపక్క ముద్రగడ, నిన్న రామనదీక్షితులు, మరో వైపు ఐవైఆర్ కృష్ణారావు… ఇప్పుడు ఆపరేషన్ గరుడ పేరు వినపడగానే ఉలిక్కి పడుతున్నారు. జగన్ రమణదీక్షితుల భేటీ తర్వాత ఏపీలో జరుగుతున్న కుట్రలపై ప్రజల్లో ఓ క్లారిటీ వచ్చింది. హిందూ మతంపై ఏ మాత్రం నమ్మకం లేని వ్యక్తి ఇంటికి రమణదీక్షితులు వెళ్లి మంతనాలు జరపడంతో..అందరిలోనూ.. ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని రగిల్చింది. అసలు ఈ ఘటనలో ఏమాత్రం సంబంధంలేని ఐవైఆర్ కృష్ణారావు. జగన్ తో రమణదీక్షితుల భేటీ తప్పేం కాదన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు.

ఈ వ్యాఖ్యల వల్ల అనేక మంది బ్రాహ్మణ సంఘాల నేతలు.. తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా పోల్చారు. “రమణదీక్షితులు ప్రతిపక్ష నేత జగన్‌ గారిని బహిరంగంగా కలిశారు. ఒకరేమో ఇది ఆపరేషన్‌ గరుడలో భాగమన్నారు. మరో తీవ్రవాది మాట్లాడుతూ.. దీక్షితులుగారు జగన్‌కు పాదాకాంత్రమయ్యారని అంటాడు. వేరొక ఉగ్రవాది.. ఇరువురికీ బంధుత్వాన్ని అంటగడతాడు. ఇంకో చానెల్‌లో అయితే శ్రీ వైష్ణవులకు ఇది కూడని పని అని ఏవో వైష్ణవ సంఘాలు అన్నట్లు వార్తలు ప్రసారం చేశాయి” అని ఐవైఆర్‌ తన ట్విటర్‌లో రాసుకొచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య, సిరివరపు శ్రీధర్ లాంటి వాళ్లను.. తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా పోల్చారు. ఐవైఆర్ తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా పోల్చిన వారంతా బ్రాహ్మణ సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. ఐవైఆర్ తీరుపై బ్రాహ్మణ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వ్యక్తిగత స్వార్ధం కోసం తప్పు చేస్తూ ఇప్పుడు బ్రాహ్మణ వర్గాలకే.. తీవ్ర ద్రోహం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.