అవకాశాలే లేని సునీల్‌ సహాలిస్తే ఇలాగే ఉంటుంది!

Sunil-does-not-act-in-Sathu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కమెడియన్‌గా ఎన్నో చిత్రాలు చేసి టాప్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న సునీల్‌, హీరోగా మారి రెండు మూడు చిత్రాలతో సక్సెస్‌లు దక్కించుకున్నాడు. చాలా కాలంగా కూడా సునీల్‌ హీరోగా వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా సునీల్‌కు హీరోగా సక్సెస్‌ అనేది లేకుండా పోయింది. దాంతో సునీల్‌ మళ్లీ కమెడియన్‌గా మారాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ సమయంలో ఆయనకు తమిళంలో సక్సెస్‌ అయిన ‘చతురంగ వెట్టై’ అనే రీమేక్‌లో నటించే అవకాశం దక్కింది. నిర్మాత కృష్ణ ప్రసాద్‌ ఈ రీమేక్‌ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. కొత్త దర్శకుడితో ఈ చిత్రం రీమేక్‌కు ఏర్పాట్లు జరిగాయి.

‘చతురంగ వెట్టై’ అనే చిత్రం సీరియస్‌ స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. కాని సునీల్‌కు అలా నచ్చలేదు. అదే కథను మార్చి ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేద్దామని నిర్మాతకు సలహా ఇచ్చాడట. ఈ కథతో ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసి చూపిస్తే ప్రేక్షకులు తిరష్కరించే అవకాశం ఉందని, అందుకే ఉన్నది ఉన్నట్లుగా చేద్దామని అన్నాడట. అందుకు సునీల్‌ నిరాకరించడంతో ఆ ప్రాజెక్ట్‌ నుండి సునీల్‌ను నిర్మాత తొలగించినట్లుగా తెలుస్తోంది. సునీల్‌ను తప్పించిన ఆ రీమేక్‌లో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో నటుడిగా ఆకట్టుకున్న సత్య దేవ్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో నటించిన సత్యదేవ్‌ రీమేక్‌లో సెట్‌ అవుతాడని నిర్మాత కృష్ణ ప్రసాద్‌ భావించాడట. అందుకే సినిమా రీమేక్‌ను సత్యదేవ్‌తో షురూ చేయబోతున్నాడు.