కొత్త రోల్ లో రేణుక … ఢిల్లీ టూ హైదరాబాద్.

congress leader mukka Renuka Chowdhury plans on 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు అంతర్గత విభేదాలు పరిష్కరించుకుంటూ ఇంకో వైపు 2019 లో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణాలో కెసిఆర్ ని ఢీకొట్టాలంటే మాటలు కాదని కాంగ్రెస్ నేతలకు అర్ధం అయ్యింది. అయితే ఆయనతో, ఆయన పాలన తో విభేదించేవాళ్ళకి నైతిక మద్దతుగా నిలిస్తే ఎన్నికల్లో తెరాస ని ఓడించడం సాధ్యమే అని కాంగ్రెస్ వ్యూహకర్తల భావన. ఈ కోవలో తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ కి అండగా నిలిచి ఆపై తెరాస దూరం పెట్టిన వారిని పేరుపేరునా కలిసి వారిని దగ్గరికి చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది.

ఇక కాంగ్రెస్ ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇప్పుడు తెలంగాణ లో వున్న 119 స్థానాలకు గాను 29 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వున్నాయి. ఇక్కడ పార్టీల గెలుపు ఓటములు నిర్ణయించే శక్తి సెటిలర్స్ కి వుంది. ఈ విషయం గమనించిన తెరాస తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వారిని ఇబ్బంది పెడుతూ వ్యవహరించిన దాఖలాలు లేవు. పైగా సెటిలర్స్ కూడా పోరాట బాట వదిలేసి తమ పని తాము చూసుకునే ధోరణిలోకి వెళ్లిపోయారు. ఇద్దరికీ ఓ అనధికార ఒప్పందం జరిగిపోయినట్టు అయింది. అయితే ఈ సెటిలర్స్ ప్రస్తుతం ఏ పార్టీ ని ఓన్ చేసుకునేందుకు సిద్ధంగా లేరు. టీడీపీ బలహీనపడ్డాక వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎక్కువమంది తమ అవసరాల రీత్యా తెరాస కి అనుకూలంగా వుంటున్నారు. ఆ పార్టీ కూడా వారిని చేరదీస్తొంది. ఈ పరిస్థితి మార్చడానికి కాంగ్రెస్ కి ఓ తురుపు ముక్క అవసరం పడింది. ఆ తురుపు ముక్క రేణుక చౌదరి రూపంలో వారికి కనిపించింది.

రేణుక కొన్నేళ్లుగా జాతీయ రాజకీయాలకే పరిమితం అయ్యారు. అడపాదడపా తెలంగాణ వస్తున్నా అంత క్రియాశీలంగా లేరు. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం , సెటిలర్స్ ఓట్ల కోసం రంగంలోకి దిగడానికి ఆమె సంసిద్ధత వ్యక్తం చేసింది. విభజన దెబ్బకి 2014 లో సెటిలర్స్ కాంగ్రెస్ కి ఓటు చేయలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అందుకే ఆ బాధ్యతని రేణుక మీద పెట్టింది టీ కాంగ్రెస్. ఈ విషయం మీద నేరుగా ఆమెని సంప్రదించకుండా హైకమాండ్ లోని పెద్దలతో చెప్పించారట. అందుకు ఒప్పుకున్న రేణుక ఇక జంటనగరాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందట.