ఇది కాంగ్రెస్ మార్క్ బ్రేకింగ్ న్యూస్

Congress released April fools video against BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గ‌తంలో సోష‌ల్ మీడియాలో బాగా వెనుక‌బ‌డి ఉండే కాంగ్రెస్… ఇప్పుడు మాత్రం బీజేపీకి దీటుగా సామాజిక మాద్య‌మాల‌ను ఉప‌యోగించుకుంటోంది. ప్ర‌తి సంద‌ర్భంలోనూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేంద్ర‌ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతోంది. తాజాగా ఏప్రిల్ 1 ఫూల్స్ డే ను కూడా కాంగ్రెస్ వినూత్నంగా వాడుకుంది. మోడీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ వీడియోను రూపొందించి అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసింది. ఆ వీడియోలో ప్ర‌భుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది. మోడీ ప్ర‌భుత్వం 200 కోట్ల ఉద్యోగాలు క‌ల్పించింద‌ని, అంగార‌క గ్ర‌హం నుంచి గ్ర‌హాంత‌ర‌వాసులు కూడా ఇప్పుడు భార‌త్ లో ఉద్యోగాలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేసింది.

మోడీ స‌ర్కార్ ప్ర‌ధాన ఎన్నిక‌ల నినాద‌మ‌యిన స్మార్ట్ సిటీపైనా వ్యంగ్య వ్యాఖ్య‌లు చేసింది. స్మార్ట్ సిటీలో చెత్త‌ను రోబోలు సేక‌రిస్తున్నాయ‌ని కామెంట్లు గుప్పించింది. న‌మామీ గంగా ప్రాజెక్టుపైనా కాంగ్రెస్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. చెత్తా, చెదారంతో నిండిన గంగాన‌దిలో ఇప్పుడు మోడీ చిత్ర‌ప‌టం కూడా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని వ్యంగాస్త్రం విసిరింది. మొత్తానికి ఈ కాంగ్రెస్ మార్క్ బ్రేకింగ్ న్యూస్ వీడియోను ఆ పార్టీ వ‌ర్గాలు తెగ షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒక విమ‌ర్శ‌చేస్తే ప్ర‌తిగా వంద విమ‌ర్శ‌లు గుప్పించే, బీజేపీ సోష‌ల్ మీడియా ఈ వీడియోపై ఎలా స్పందిస్తుందో చూడాలి.