ఏపీ ప్ర‌త్యేక హోదాకు రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు

Congress President Rahul Gandhi supported AP demands

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ మాండ్ల‌కు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు తెలిపారు.ప్ర‌జ‌ల  ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఏపీని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌న్న ఏపీ ప్ర‌జ‌ల డిమాండ్ల‌కు మ‌ద్ద‌తు పలుకుతున్నాన‌ని చెప్పారు. న్యాయం కోసం అన్ని పార్టీలు ఏక‌మై పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర బ‌డ్జెట్ త‌ర్వాత విభ‌జ‌న హామీల అమ‌లుకోసం టీడీపీ ఎంపీలు లోక్ స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్ట‌గా…తొలి మూడు రోజులూ కాంగ్రెస్ స్పందించ‌లేదు. అయితే మోడీ త‌న ప్ర‌సంగంలో విభ‌జ‌న నేరం మొత్తం కాంగ్రెస్ పై నెడుతూ చేసిన ప్ర‌సంగం త‌ర్వాత ఆ పార్టీ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది.

rahul gandhi about ap special status

ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి వ్యూహాత్మ‌కంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఎంపీలు చేస్తున్న పోరాటం అనుకోని అవ‌కాశంగా క‌లిసివ‌చ్చింది. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై బీజేపీ మీద ఏపీ ప్ర‌జ‌లు ఆగ్రహంతో ఉన్న నేప‌థ్యంలో ఎంపీల పోరాటానికి బాస‌ట‌గా నిల‌వ‌డం ద్వారా రాష్ట్రంలో మ‌ళ్లీ బ‌ల‌ప‌డాల‌న్న‌ది కాంగ్రెస్ వ్యూహం. బీజేపీ ముందు ముందు కూడా ఇలాగే ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాలు లెక్క‌లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే…ఆ పార్టీపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త వ‌ల్ల‌ ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవ‌కాశాలు లేకపోలేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.