తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,213 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఒక్క రోజు వ్యవధిలో తెలంగాణలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 9,069 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 9,226 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా మరో 8 మంది కరోనాతో మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 275కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 998 ఉన్నాయి.