కరోనా గురించి ప్రజల్లో భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు

కరోనా గురించి ప్రజల్లో భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు

కరోనా వైరస్ మన భారతదేశానికి కూడా తాకింది. ఇప్పటికే మన దేశంలో 31 పాజిటివ్ కేసులు తేలడం తో… వారికి ప్రభుత్వం ప్రత్యేంకంగా చికిత్సఅందిస్తుంది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలని కేంద్రం అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే … కరోనా వైరస్ ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అని కొందరు సోషల్ మీడియాలో విరివిగా వార్తలు వైరల్ చేస్తున్నారు. దీనితో స్థానిక ప్రజానీకం మన ప్రాంతంలో కూడా కరోనా వచ్చిందంటా అంటూ తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.

కరోనా పై సోషల్ మీడియా లో వస్తున్న పుకార్ల పై ఏపీ డీజీపీ స్పందించారు. కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని నమ్మవద్దని అలాగే మీడియా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై అపోహలు సృష్టిస్తే సహించేది లేదు అంటూ కరోనా పై తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారికీ వార్నింగ్ ఇచ్చారు. వదంతులు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వదంతులు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పోలీసులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అని తెలిపారు. ప్రతి రోజూ రాష్ట్ర వైద్య కమిషనర్ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనాపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేస్తున్నట్లు గుర్తుచేశారు