భారత్ లో కరోనా న్యూ రికార్డ్

భారత్‌లో కరోనా వైరస్ వీరలెవల్లో విజృంభిస్తోంది. కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకూ పెగుతుంది గానీ… ఏమాత్రం తగ్గడంలేదు కదా మరణాల శాతం కూడా పెరుగుతున్నాయి. గంటగంటకు కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2293 కొత్త కేసులు నమోదుకాగా… 24 గంటల్లోనే 71 మంది మృతిచెందారు.. అయితే 9951 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా… దేశవ్యాప్తంగా ప్రస్తుతం 26,167 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కరోనా బులెటిన్‌లో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ముఖ్యంగా మహారాష్ట్రలో 11,506 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు ఉండడంతో అక్కడ జనాలకు తీవ్ర కలవరం మొదలైంది. ఇక.. గత 24 గంటల్లో నమోదైన కేసులు కలుపుకొని.. దేశ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 37,336కు చేరింది. మృతుల సంఖ్య 1,218కు పెరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు రోజుకు 2 వేల లోపు పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. తాజాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నట్టుండి ఆ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. సుమారు 2300 వరకు చేరింది. ఇది భారత్‌లో కొత్త రికార్డుగా నమోదైంది. కాగా ఇప్పటి వరకు ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.