దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,42,417కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 482 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 20,642కి పెరిగింది.

కరోనా వైరస్‌ నుంచి కోలుకుని 4,56,830 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 2,64,944 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. కోవిడ్‌-19 విజృంభణ కొనసాగుతుండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,62,679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ దేశంలో 1,04,73,771 కరోనా టెస్టులు నిర్వహించారు.