ఆందోళన చెందుతున్న జర్మనీ

ఆందోళన చెందుతున్న జర్మనీ

గత ఏడు రోజులుగా దేశంలో ప్రతి లక్ష మంది జనాలకు కరోనా సంభవించే రేటు 201.1గా ఉందని జర్మనీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. పైగా గతేడాది జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 22, 2020 నాటికి కరోనా కేసులు 197.6కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జర్మనీలో 70 శాతం మంది ఇంకా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోలేదన్నారు.

రానున్న నెలల్లో త్వరితగతిన వ్యాక్సిన్‌ తీసుకోనట్లయితే వారంతా కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. తూర్పు రాష్ట్రమైన సాక్సోనీలో కరోనా సంభవంచే రేటు జాతీయ సగటు 491.3 కంటే రెండింతలు ఎక్కువగా ఉందిని తెలిపారు. ఏది ఏమైనా వ్యాక్సిన్‌ తీసుకోనివారు మరిన్ని పరిమితులకు లోబడి ఉండాల్సిందేనని ఆంక్షలు జారీ చేశారు.

గతనెలలో జరిగిని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ కేసులు అధిగమైనట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో సంకీర్ణ పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లోపు కనీసం వ్యాక్సిన్‌ తీసుకోని వారికి లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించేలా చర్యలు తీసుకోవలని జర్మనీ అధికారులు స్పష్టం చేశారు.